hyderabadupdates.com Gallery ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం post thumbnail image

న్యూఢిల్లీ : ఏఐ ప్రయోజ‌నాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డంలో యుఎస్, భార‌త భాగ‌స్వామ్యం కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్‌గా పని చేయడం పట్ల గూగుల్ గర్వంగా ఉందని అన్నారు. ఢిల్లీలోని ఇంపాక్డ్ ఇండియా ఏఐ స‌మ్మిట్ లో సీఈవో పాల్గొని ప్ర‌సంగించారు. ఇదిలా ఉండ‌గా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు ఏఐ గురించి ఆందోళ‌న చెందుతోంద‌న్నారు. ఈ క్ర‌మంలో ప్రారంభ సెష‌న్ సంద‌ర్బంగా ఏఐ ప్రాధాన్య‌త గురించి వివ‌రించ‌డం జ‌రిగింద‌ని స్పష్టం చేశారు సుంద‌ర్ పిచాయ్. అయితే ఏఐ గురించి ఎక్కువ‌గా ఆందోళ‌న చెందుతున్నార‌ని , టెక్నాల‌జీలో ఇలాంటివి స‌ర్వ సాధార‌ణ‌మేన‌ని పేర్కొన్నారు.
ప్ర‌తి మార్పు కొత్త ప్ర‌పంచానికి నాంది ప‌లుకుతుంద‌న్నారు. ఒక‌ప్పుడు యాహూ, రీడిఫ్ డామినేట్ చేసేద‌ని కానీ గూగుల్ వ‌చ్చాక వాటిని దాటుకుని ముందుకు రావ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సుంద‌ర్ పిచాయ్. అందుకే గూగుల్ ఎప్పుడూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తోంద‌న్నారు. యావ‌త్ ప్ర‌పంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌తిభావంతులైన వారిని గుర్తించి ప్రోత్స‌హించ‌డం మా బాధ్య‌త అని పేర్కొన్నారు. ఇప్పుడు స్టార్టప్ ల కాలం న‌డుస్తోంద‌న్నారు. ఇప్పుడు ఇండియా, అమెరికా దేశాల మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య ప‌ర‌మైన ఒప్పందాలే కాదు సాంకేతిక ప‌ర‌మైన సంబంధాలు కూడా కొన‌సాగుతున్నాయ‌న్నారు.
The post ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణతిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమ‌ల : తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు

అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్

సెరియా : ప్ర‌పంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపుల‌ర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జ‌కోవిచ్. ఇప్ప‌టికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మ‌రో రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్

ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీలో త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంద‌న్నారు. శ‌నివారం ఎన్టీఆర్ భరోసా