hyderabadupdates.com movies మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి.

నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో తన గుంపును విడిచిపెట్టి, మంచు పర్వతాల వైపు ఒంటరిగా ప్రయాణిస్తున్న ఈ పెంగ్విన్ వీడియో అనేక ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. తన గమ్యం మరణమని తెలిసినా అది వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లడం, మనుషుల్లోని ఒంటరితనాన్ని, “అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనే” వైరాగ్యాన్ని ప్రతిబింబిస్తోందని నెటిజన్లు భావించారు.

పంచ్ కోతి : జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో తల్లి చేత తిరస్కరణకు గురైన ఈ చిన్న ‘మెకాక్’ కోతి కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తల్లి ప్రేమ కోసం అది ఒక ఆరెంజ్ రంగు సాఫ్ట్ టాయ్‌ని (బొమ్మను) హత్తుకుని తిరుగుతున్న దృశ్యాలు చూసి జనం చలించిపోయారు. 

పెంగ్విన్ కథ “జీవితంలో ఎంతటి ఒంటరితనం ఉన్నా దేనికోసం ఆగకూడదు” అనే ఒక లోతైన వేదాంతాన్ని గుర్తుచేస్తే, పంచ్ కోతి కథ “అందరూ ఉన్నా అమ్మానాన్నల ప్రేమ లేకపోతే వచ్చే వెలితి ఎంత భారంగా ఉంటుందో” కళ్ళకు కట్టినట్లు చూపింది.

Related Post

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరును ప్ర‌జ‌లు ఛీత్క‌రించిన విష‌యంతెలిసిందే. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాల‌కు వైసీపీ ప‌రిమితం అయింది. ఇలా