hyderabadupdates.com movies విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ తాను సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నీ గమనించి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో చూసి ఇది తీశానని నొక్కి చెప్పాడు. పిల్లలు, సున్నిత మనస్కులు దూరంగా ఉండమని హింట్ కూడా ఇచ్చాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ నిజంగా ట్రెండ్ అనేది విపరీత హింసను కోరుకుంటుందా అనేది కాస్త విశ్లేషించుకోవాలి. కరోనా తర్వాత ఓటిటిల పుణ్యమా అంటూ ఓవర్ వయొలెన్స్ ఉన్న కంటెంట్ రాజ్యమేలుతున్న మాట వాస్తవం. స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ లు, సైకో కిల్లింగ్ సినిమాలు దీన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాయి.

అలాని థియేటర్ ఎక్స్ పీరియన్స్ కేవలం ఈ రక్తపాతాన్ని కోరుకుంటుందని భావిస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే యానిమల్, దురంధర్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్ లోనూ హింస ఉన్నా బలమైన కథా కథనాలు, యాక్షన్, ఎమోషన్ వాటి విజయంలో కీలక పాత్ర పోషించాయి.

వెబ్ సిరీస్ లో భావోద్వేగాలు లేకపోయినా చల్తా. ఎందుకంటే ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి. కానీ సినిమాకు ఈ ట్రీట్ మెంట్ పనికిరాదు. కట్టిపడేసే సాలిడ్ స్క్రీన్ ప్లే పడాలి. అప్పుడే  ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. అంతే తప్ప నరకడాలు, జుగుప్సాకరంగా హత్యలు చేయడాలు చూపించినంత మాత్రాన పొలోమని టికెట్లు కొనరు.

ఇంకా ఇది ప్రారంభమే కాబట్టి కల్ట్ గురించి ఒక అభిప్రాయానికి రాలేం కానీ విశ్వక్ ఒకవేళ హింసతో మెప్పిస్తాను ఇంకేం అక్కర్లేదనునకుంటే పొరపాటే అవుతుంది. నాని హిట్ 3 కూడా పెద్ద స్థాయికి వెళ్లలేకపోవడానికి కారణం ఇదే. గేమ్స్ ఆడే వాళ్ళ ప్రాణాలు తీయడమనే పాయింట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడం విశ్వక్ కు సవాల్ అవుతుంది.

అసలే వరస డిజాస్టర్లు తన మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేశాయి. ఎంత సమర్ధించుకున్నా ఫంకీని ఎవరూ హిట్ అనరు. బాగుందని సర్టిఫికెట్ ఇవ్వరు. కాబట్టి ఇకపై వీలైనంత ప్రాక్టికల్ యాంగిల్ లోకి విశ్వక్ వచ్చేయడం బెటర్. ముఖ్యంగా కల్ట్ తనకు పెద్ద ఛాలెంజ్.

Related Post

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నీలగిరి బ్లాక్‌లోని నాలుగో అంతస్తులో పనిచేస్తున్న ఓ కోచింగ్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు

వైసీపీ కార్య‌క‌ర్త‌ల నోళ్లు మూయించిన జ‌గ‌న్వైసీపీ కార్య‌క‌ర్త‌ల నోళ్లు మూయించిన జ‌గ‌న్

విశాఖ‌ప‌ట్నానికి ప్ర‌తిష్టాత్మ‌క‌ గూగుల్ డేటా సెంట‌ర్, ఏఐ హ‌బ్ రావ‌డం మీద వైసీపీ కార్య‌క్త‌లు గ‌త కొన్ని రోజులుగా ఎంత రాద్దాంతం చేస్తున్నారో, ఎన్ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారో తెలిసిందే. 80 వేల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డితో గూగుల్.. ఈ డేటా సెంట‌ర్‌,