hyderabadupdates.com movies డేర్ చేయకపోవడమే డెకాయిట్ తెలివి

డేర్ చేయకపోవడమే డెకాయిట్ తెలివి

ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2, టాక్సిక్ ఉన్న నేపథ్యంలో ఇది వాయిదా పడితే బాగుంటుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సంస్థ ఎలాంటి పబ్లిసిటీ చేయకుండా మౌనంగా ఉంది. వచ్చే వారం మొదటి ఆడియో సింగల్ వదలబోతున్నారు.

ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ లో ఎక్కడా రిలీజ్ డేట్ లేదు. అంటే మనసు మార్చుకున్నట్టే. ఒక కన్నడ, ఒక హిందీ సినిమాలకు భయపడి తెలుగు మూవీ వెనుకడుగు వేయడం ఏమిటనే డౌట్ రావొచ్చు కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

దురంధర్ 2, టాక్సిక్ ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతున్నారు. ఒక్క ఇండియాలోనే రెండు కలిపి సుమారు తొమ్మిది వేలకు పైగా స్క్రీన్లలో రాబోతున్నట్టు సమాచారం. ఈ నెంబర్ ఇంకా పెరగనుంది. ఆల్రెడీ అగ్రిమెంట్లు కూడా మొదలైపోయాయి.

ప్రతి భాషలో బడా డిస్ట్రిబ్యూటర్లు అండగా నిలవడంతో పెద్ద ఎత్తున థియేటర్లను బ్లాక్ చేసుకుంటున్నారు. మూడోది వస్తే అనవసరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. డెకాయిట్ లో కంటెంట్ ఎంత బాగా వచ్చినా ఉత్తరాది మార్కెట్ లో తగినన్ని స్క్రీన్లు దొరక్కపోతే ఆడియన్స్ కి రీచ్ కాదు. మొత్తం రణ్వీర్ సింగ్, యష్ కలిసి తినేస్తారు.

అందుకే డెకాయిట్ వెనుక అడుగు వేస్తే మంచి నిర్ణయం అవుతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు షానియేల్ డియో దర్శకత్వం వహించాడు. భీమ్స సంగీతం సమకూరుస్తున్నారు. టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది.

నాగార్జున పాటను రీమిక్స్ చేసుకుని దాన్ని వాడుకున్న విధానం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు వదలబోయే లవ్ సాంగ్ కూడా మంచి మెలోడీతో ఉంటుందట. దొంగగా మారిన ఒక వ్యక్తి పోలీసులు, ప్రభుత్వాన్ని ఎలా ముప్పతిప్పలు పెట్టాడనే పాయింట్ మీద డెకాయిట్ రూపొందింది. అడివి శేష్ ఏకంగా దీని కోసమే మూడు సంవత్సరాలు ఖర్చు పెట్టాడు.

Related Post

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు అని శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హెచ్చరించింది. మనం

Shah Rukh Khan’s King to have six crazy action blocks, deets insideShah Rukh Khan’s King to have six crazy action blocks, deets inside

Shah Rukh Khan’s upcoming film King is shaping up to be a high-octane action spectacle. Directed by Siddharth Anand, the film reportedly features six massive action sequences, each designed on