hyderabadupdates.com movies 215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్లు లేకుండానే వందల కోట్లు ఎలా కొల్లగొట్టవచ్చో దర్శకుడు ఆదిత్య ధార్ నిరూపించాక గతంలో వచ్చిన టైగర్, వార్ లాంటి ఫ్రాంచైజీలు తక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి.

వీటి సంగతి అలా ఉంచితే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతున్న అల్ఫా గత డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యంతో పాటు విఎఫెక్స్ తదితర కారణాల వల్ల ఏప్రిల్ కు వాయిదా వేశారు. తాజాగా ముంబై వర్గాల్లో వినిపిస్తున్న పుకారు సినీ ప్రియులు నమ్మశక్యంగా లేదనేలా ఉంది.

దాని ప్రకారం అల్ఫాని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ 215 కోట్ల ఆఫర్ ఇస్తే నిర్మాత ఆదిత్య చోప్రా వద్దని చెప్పారట. నిజానికి అల్ఫా బడ్జెట్ కూడా అంత అయ్యుండదు. కారణం ఏంటంటే అల్ఫాలో థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ బోలెడు ఉందట.

అందులోనూ అలియా భట్ లాంటి టాప్ పర్ఫార్మార్, వామికా గబ్బి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఇలాంటి ఆలోచన చేయమని ఆదిత్య చోప్రా తేల్చి చెప్పారట. ఇది నిజమో కాదో కానీ విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ది రైల్వే మెన్ తీసిన శివ్ రవైల్ ఈ అల్ఫాకు దర్శకుడు కావడం నెట్ ఫ్లిక్స్ ఆఫర్ కు కారణం కావొచ్చని ఒక టాక్.

బాబీ డియోల్ విలన్ గా నటించిన అల్ఫా ఇద్దరు లేడీ గూఢచారుల సాహసాల నేపథ్యంలో సాగుతుంది. తొలుత సల్మాన్ ఖాన్, షారుఖ్, హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఇద్దరితో క్యామియోలు చేయించాలని చూసినప్పటికీ ప్రస్తుతం అది జరగడం అనుమానమే అంటున్నారు.

సల్మాన్ ఒక్కడే సానుకూలంగా ఉండటంతో ఏం చేయాలనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని వినికిడి. యష్ రాజ్ స్పై యునివర్స్ పేరుతో ఒక సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తున్న ఆదిత్య చోప్రాకు టైగర్ 3 ఫలితం, వార్ 2 డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చాయి. మరి అల్ఫా అయినా హిట్ అందుకుని ఆయనకు ఊరట కలిగిస్తుందో లేదో చూడాలి. 

Related Post

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ కెరీర్ ఆరంభంలో ఎప్పుడో పెప్సి బ్రాండును కొంత కాలం ప్ర‌మోట్ చేసిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత ఎప్పుడూ యాడ్స్ జోలిక

మోదీతో మరోసారి పుతిన్.. అందరి కళ్లు భారత్ వైపేమోదీతో మరోసారి పుతిన్.. అందరి కళ్లు భారత్ వైపే

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు భారత్ వైపే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన