hyderabadupdates.com movies ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి తప్పు మీదంటే మీది అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో ఆ అంశంపై మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

లడ్డూ తరహా అంశం ఇస్లాంలోగానీ, క్రిస్టియానిటీలోగాని జరిగి ఉంటే వేరేలా ఉండేదని పవన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోతుందన్న భయం రాజకీయ నాయకుల్లో ఉందని, కానీ, హిందువులు ఎక్కడికి వెళ్లరన్న భావన ఉందని అన్నారు. హిందువులకు సంబంధించిన అంశం కాబట్టి సీరియస్ నెస్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

లడ్డూ విషయంలో హిందువులు తమను తామే నిందించుకోవాలని పవన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. మిగతా మతాలను చూసి హిందువులు నేర్చుకోవాలని, కులాల వారీగా హిందువులు విడిపోయారని అన్నారు. ఇక, గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని జగన్ ను ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు.

గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పానని, టీటీడీ బోర్డులోని వారిని జగన్ ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని అన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని పవన్ వెల్లడించారు.

ఒక్క లీటర్ పాలు కూడా నెయ్యి తయారీకి వాడలేదని సిట్ తెలిపిందని అన్నారు. నెయ్యిలో నెయ్యే లేదని తేలిందని, రసాయనాల నుంచి నెయ్యి తీయవచ్చని చూపించారని మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ లేదు, జంతువుల కొవ్వు లేదని అనడంతోనే సభలో ఇంత మంది మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.

Related Post

Ram is the King of Hearts – Bhagyashri Borse’s speech becomes a hot topicRam is the King of Hearts – Bhagyashri Borse’s speech becomes a hot topic

Talented actress Bhagyashri Borse’s speech at Andhra King Taluka’s musical concert at RK Beach in Vizag on Saturday night continues to be a hot topic. The way Bhagyashri showered praises,