hyderabadupdates.com Gallery కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా

కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా

కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా post thumbnail image

కోల్ క‌తా : ఐసీసీ టోర్నీలో భాగంగా కీల‌క‌మైన మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జ‌ట్టు ఒక‌వేళ సెమీ ఫైన‌ల్ లేదా ఫైన‌ల్ కు చేరుకుంటే క‌చ్చితంగా ఇండియాలోని కోల్ క‌తా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎలా స్పందిస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా ఆయా మ్యాచ్ ల‌కు సంబంధించి బీసీసీఐ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంగ‌ళ వారం నుంచి టికెట్లు కూడా పెద్ద ఎత్తున అమ్మ‌కానికి వ‌చ్చాయి. లా అండ్ ఆర్డ‌ర్ దృష్ట్యా ఒక‌వేళ పాకిస్తాన్ గ‌నుక ఇండియాలో ప‌ర్య‌టించ‌క పోతే లేదా ఆడ‌క పోతే , నిరాక‌రిస్తే గ‌నుక అమ్ముడు పోయిన టికెట్ల స్థానంలో తిరిగి డ‌బ్బులు క్రికెట్ ఫ్యాన్స్ కు అంద‌జేస్తామ‌ని బీసీసీఐ ప్ర‌కటించింది.
శ్రీలంక అర్హత సాధించి భారతదేశం కాకుండా మరే ఇతర జట్టుతో సెమీఫైనల్ ఆడితే కూడా తిరిగి చెల్లింపు ఉంటుందని స్ప‌ష్టం చేసింది ఐసీసీ. ఇదిలా ఉండ‌గా ఐసీసీ టి20 మెగా టోర్నీ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. వ‌చ్చే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 5వ తేదీన రెండ‌వ సెమీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఇక మొత్తంగా ఈ రెండింటిలో గెలుపొందిన జ‌ట్లు నేరుగా ఫైన‌ల్ కు అర్హ‌త సాధిస్తాయి. మార్చి 8వ తేదీన గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.
The post కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు అక్కినేని నాగార్జున‌. త‌న సినీ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 99 మూవీస్ చేశాడు. ఇది కూడా ఓ రికార్డ్. అటు న‌టుడిగా ఇటు యాంక‌ర్ గా త‌ను జ‌నాద‌ర‌ణ

Degree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యDegree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Degree Student : విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలేక… డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలలో ఇద్దరు మహిళా అధ్యాపకులు… తమ లైంగిక అవసరాలు తీర్చాలంటూ