hyderabadupdates.com Gallery అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా post thumbnail image

అమ‌రావ‌తి : రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.6,000ను కూడా తమవేనని చూపిస్తూ రైతులను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్”లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. అర్హత కలిగిన భూయజమానులు, అటవీ భూమి సాగుదారులకు మూడు విడతల్లో రాష్ట్రం నుంచి రూ.14,000 మరియు కేంద్రం నుంచి రూ.6,000 చొప్పున అందజేస్తున్నారని తెలిపారు.
భూమిలేని సాగుదారులకు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే సంవత్సరానికి రూ.20,000 రెండు విడతల్లో చెల్లిస్తున్నామ‌న్నారు అచ్చెన్నాయుడు. 2025–26లో ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రెండు విడతల్లో కలిపి రూ.6,309.44 కోట్లు (రాష్ట్రం రూ.4,685.84 కోట్లు; కేంద్రం రూ.1,623.60 కోట్లు) 46.86 లక్షల రైతు కుటుంబాలకు పంపిణీ చేశామ‌న్నారు. అర్హత ఉన్నవారు మిగిలి పోకుండా గ్రీవెన్స్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. 2026–27 సంవత్సరానికి మొత్తం రూ.9,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని వెల్లడించారు అచ్చెన్నాయుడు.
దీని వలన రాష్ట్రంలోని పంట భూములు న్యూట్రియంట్ సమతౌల్యం ఏర్పడి పంట ఉత్పత్తి , ఉత్పాదకత పెరగటం ద్వారా రైతుల ఆదాయాలు పెరిగాయన్నారు. అదే వైసీపీ హయాంలో 2019-2024 మధ్య కాలంలో కేవలం ఒక్క 2019-20 సంవత్సరంలో మాత్రమే రూ.31.35 కోట్లు సబ్సిడీ వ్యయంతో 31,859 టన్నుల సూక్ష్మపోషకాలు 1.47 లక్షల మంది రైతులకు మాత్రమే, అదికూడా రాయితీని 100% నుండి 70% కి తగ్గింఛి పంపిణీ చేశార‌ని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 2025-26 రబీ సీజన్ కోసం సబ్సిడీపై సూక్ష్మ పోషకాల సరఫరాకు 16.17 కోట్ల రూపాయలు ఖర్చు చేశామ‌న్నారు.
The post అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

ముంబై : వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ క్రికెట‌ర్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు అరుదైన ఛాన్స్ ల‌భించింది. తాజాగా ప్ర‌ముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌ను త‌మ కంపెనీకి బ్రాండ్

Karnataka: కర్ణాటక సీఎం రేసులో జి. ప‌ర‌మేశ్వ‌ర ?Karnataka: కర్ణాటక సీఎం రేసులో జి. ప‌ర‌మేశ్వ‌ర ?

Karnataka : క‌న్న‌డ‌నాట సీఎం సీటు కోసం సిగ‌ప‌ట్లు కొన‌సాగుతున్నాయి. సీఎం సిద్ధ‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ మ‌ధ్య కుర్చీలాట‌కు ఇప్పుడ‌ప్పుడే ముగింపు ఉండేట్టు క‌న‌బ‌డ‌డం లేదు. అంతా హైక‌మాండ్ చూసుకుంటుంద‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే కంటితుడుపు

ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులుఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. 80 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు