hyderabadupdates.com movies నిన్న ఏపీ… నేడు నాగ్‌పూర్

నిన్న ఏపీ… నేడు నాగ్‌పూర్

వరుస పేలుళ్లు వణుకు పుట్టిస్తున్నాయి. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే, ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మరో భారీ పేలుడు సంభవించింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 21 మంది మరణించగా, నాగ్‌పూర్ జిల్లా కటోల్ తాలూకాలోని ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ అనే పేలుడు పదార్థాల కర్మాగారంలో జరిగిన ప్రమాదం 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు పారిశ్రామిక భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

నాగ్‌పూర్ జిల్లా రావుల్‌గావ్‌లో ఉన్న ఈ కర్మాగారంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మైనింగ్, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పేలుడు పదార్థాలను తయారు చేసే ఈ యూనిట్‌లో డెటొనేటర్ ప్యాకింగ్ విభాగంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ధాటికి ఫ్యాక్టరీ భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు 17 మంది మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

నిన్న ఏపీలో జరిగిన ఘటన కూడా ఇంతే భీభత్సాన్ని సృష్టించింది. సామర్లకోట సమీపంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమలో జరిగిన పేలుడు శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించిందంటే దాని తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం అత్యంత విషాదకరం. పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని, సమీపంలోని పాఠశాల భవనాలకు పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్న మాటలు వింటుంటే ఒళ్లు గగురు పుట్టిస్తోంది.

బాణసంచా తయారీ కేంద్రాలు లేదా పేలుడు పదార్థాల ఫ్యాక్టరీల్లో చిన్నపాటి అజాగ్రత్త కూడా భారీ ప్రాణనష్టానికి దారితీస్తోంది. నాగ్‌పూర్ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రెండ్రోజుల్లో సుమారు 40 మంది పేద కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పరిశ్రమల యాజమాన్యాలు లాభాల కోసం భద్రతా నియమాలను గాలికి వదిలేయడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Post

అమ‌రావ‌తి.. @ 2025 ..!అమ‌రావ‌తి.. @ 2025 ..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి 2025 ఓ మ‌హ‌త్త‌ర సంవ‌త్స‌ర‌మేన‌ని చెప్పాలి. 2014-19 మ‌ధ్య ఏపీ రాజ‌ధానిగా ఏర్పడిన అమ‌రావ‌తి.. త‌ర్వాత వైసీపీ హ‌యాంలో వెనుక‌బ‌డింది. అస‌లు దీనిని లేకుండా చేయాల‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తీసుకురావాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నించింది. కానీ, రాజ‌ధాని రైతులు

మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజంమాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం

పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030 నాటికి ఆసియాలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేస్తుంది. సూర్యలంకతో పాటు సూళ్లూరు