hyderabadupdates.com Gallery ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం

ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం

ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం post thumbnail image

ఇరాన్ : ఇరాన్ దేశానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. నిన్న‌టి దాకా అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంట‌రి పోరాటం చేస్తూ వ‌చ్చిన ఆ దేశ అధ్య‌క్షుడు ఖ‌మేనీ ఇజ్రాయెల్, అమెరికా జ‌రిపిన దాడుల్లో ఖ‌తం అయ్యాడు. ఈ విష‌యాన్ని అటు ట్రంప్ ఇటు ఇరాన్ ధ్రువీక‌రించింది. 86 ఏళ్ల నాయకుడు శనివారం తెల్లవారుజామున తన కార్యాలయంలో హత్యకు గురయ్యారని తెలిపాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారని ఇరాన్ రాష్ట్ర మీడియా కూడా స్ప‌ష్టం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఇదిలా ఉండ‌గా ఇరాన్ సుప్రీం లీడర్ బలిదానానికి చేరుకున్నారని రాష్ట్ర ప్రసార సంస్థ ఐఆర్ఐబీ ఆదివారం ప్ర‌క‌టించింది. ఖ‌మేనీ త‌న జీవితాన్ని ఇరాన్ దేశం కోసం, ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఆ దిశ‌గా ఆయ‌న ప‌ర‌లోకానికి వెళ్లి పోయాడ‌ని పేర్కొన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ‌.
కాగా అంత‌కు ముందు ఇజ్రాయెల్ జ‌రిపిన దాడుల్లో ఇరాన్ దేశాధినేత ఖ‌తం అయ్యాడ‌ని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. అత‌ని మృత దేహం కూడా క‌నిపించింద‌ని తెలిపింది. టెహ్రాన్‌లోని కాంపౌండ్ నుండి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు అతని మృతదేహం చిత్రాన్ని చూపించారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదించింది. మ‌రో వైపు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చీఫ్ ఖ‌మేనీ మ‌ర‌ణించిన‌ట్లు త‌న సామాజిక మాధ్య‌మం వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఏకైక గొప్ప అవకాశం అని ట్రంప్ అన్నారు. 1989 నుండి ఇరాన్‌కు నాయకత్వం వహించిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేసిందని అమెరికన్ కమాండర్-ఇన్-చీఫ్ చెప్పారు.
The post ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోనుఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను

న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌మాన్ అవార్డుల ప్ర‌దానోత్సం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త జ‌ట్టు త‌ర‌పున

వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాంవెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం

ఖ‌మ్మం జిల్లా : వెలుగుమ‌ట్ల నిర్వాసితుల‌కు 15 లోపు ప‌ట్టాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. బాధితులకు అండగా నిలుస్తాం అన్నారు. వెలుగుమట్ల వంటి సంఘటనలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయ‌ని తెలిపారు. వాటిని

జ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణజ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణ

విజ‌య‌వాడ : జ‌న‌సేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ రాస‌లీల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని ప‌ట్ల ఆయ‌న అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో బాధితురాలు ధైర్యంగా