hyderabadupdates.com Gallery ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు

ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు

ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు post thumbnail image

హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జ‌రిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిహారం అంద‌జేశారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకే అందర్నీ సచివాలయానికి పిలిచి పరిహారం అందించామని చెప్పారు. ఈ ప్ర‌భుత్వం మీది. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అంద‌రికీ అండ‌గా ఉంటామని ముఖ్య‌మంత్రి బాధిత కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చారు. ప్ర‌మాదం జరిగినట్లు తెలుసుకున్న వెంట‌నే మంత్రి అజ‌హ‌రుద్దీన్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మ‌దీనాకు పంపామ‌ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు.
చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌క్ష‌ణ‌మే పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి మ‌దీనా పంపించామ‌న్నారు. అక్క‌డి భార‌త్ కాన్సులేట్‌, సౌదీ ప్ర‌భుత్వంతో చ‌ర్చించి మృతి చెందిన వారి అంత్య‌క్రియ‌లు జ‌న్నుతుల్ బ‌ఖీలో చేయించిన విషయాలను గుర్తు చేశారు. నవంబర్ 17, 2025 న మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున, గాయపడిన ఒకరి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం అందించారు.
దేశం బ‌య‌ట జ‌రిగే ప్ర‌మాదాల్లో మృతిచెందిన వారికి ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించే విధానం లేనప్పటికీ, ప్రభుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం అందించాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవ‌ల నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించామ‌న్నారు. ముస్లిం సోద‌రుల‌తో త‌నకున్న‌ అనుబంధాన్ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకున్నారు. తాను కొడంగ‌ల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన 2009 సంవ‌త్స‌రం నుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని అయిదు మండ‌లాల నుంచి ఒకొక్క‌రి చొప్పున ఏటా అయిదుగురిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో హ‌జ్ యాత్ర‌కు పంపుతున్నాన‌ని చెప్పారు. వారిని ఎంపిక చేసే బాధ్య‌త స్థానిక ముస్లిం మ‌త పెద్ద‌ల‌కే అప్ప‌జెప్పాన‌న్నారు.
The post ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలుశ్రీవారి వైద్య సేవకులకు సౌకర్యాలపై చర్యలు

తిరుపతి : టిటిడిలో త్వరలో ప్రారంభించనున్న శ్రీవారి వైద్య సేవకులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టినట్లు టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని అవసరమైన

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలుAzam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

    డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ 1993 జనవరి 1వ

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ విచార‌ణఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ విచార‌ణ

హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ విచార‌ణ ముగిసింది. ఆదివారం మ‌ధ్యాహ్నం త‌ను నివాసం ఉంటున్న నందిన‌గ‌ర్ కు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. భారీ ఎత్తున