hyderabadupdates.com Gallery ఆ వీడియోలు నావి కావు : బీఆర్ నాయుడు

ఆ వీడియోలు నావి కావు : బీఆర్ నాయుడు

ఆ వీడియోలు నావి కావు : బీఆర్ నాయుడు post thumbnail image

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి , టీవీ 5 చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంచ‌ల‌నంగా మారారు. త‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాను ముంచెత్తాయి. దీంతో త‌న‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు, వంద‌ల కోట్ల మంది భ‌క్తులు క‌లిగిన తిరుమ‌ల ఆల‌యానికి చైర్మ‌న్ గా ఇలాంటి వ్య‌క్తి ఉండ‌డం భావ్యం కాద‌ని, త‌క్ష‌ణ‌మే త‌ను త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కోరుతున్నారు. దీంతో ఈ అస‌భ్య‌క‌ర‌మైన వీడియోలపై స్పందించారు బీఆర్ నాయుడు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రు కావాల‌ని నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ నాయుడు.
వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ‌) సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినదని పేర్కొన్నారు. .. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథ‌కం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. దీనిపై తాను చట్ట ప్రకారం ముందుకు వెళ‌తాన‌ని ప్ర‌క‌టించారు బీఆర్ నాయుడు.
నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు .
The post ఆ వీడియోలు నావి కావు : బీఆర్ నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీకొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్‌స్ట్రక్షన్స్ కొండ‌ల‌ను త‌వ్వుతోంద‌ని ఆరోపించారు. అనుమ‌తులు లేకుండా త‌వ్వుతున్నా హైడ్రా ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు. రేవంత్

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex : రోలెక్స్‌… ఈ పేరు చాలా ఫేమస్‌. విక్రమ్ సినిమా ఎండ్ టైటిట్ కార్డు పడేటప్పుడు… ఆ సినిమా సీక్వెల్ కు హింట్ ఇస్తూ… రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఈ రోలెక్స్ (Rolex)

స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడుస్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు

అమరావతి : వ్య‌వ‌సాయం దండుగ కాద‌ని అది పండుగ అని అందుకే త‌మ స‌ర్కార్ ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు ఏపీ రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా