hyderabadupdates.com movies ఈ చైనా సరుకులు ఎప్పుడూ పనిచేయవా?

ఈ చైనా సరుకులు ఎప్పుడూ పనిచేయవా?

ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల మీద చూసుకుంటే అవి సూపర్ పవర్ లెవెల్ లో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులను గుర్తిస్తాయి అంటారు. ఒకేసారి ఎన్నో లక్ష్యాలను ట్రాక్ చేస్తాయి అంటారు. కానీ అసలు పరీక్ష యుద్ధభూమిలో పడితే మాత్రం కథ వేరేలా మారుతోంది.

ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలు పెద్దగా పనిచేయలేదనే వార్తలు వచ్చాయి. ఇరాన్ భారీగా పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన ఈ సిస్టమ్స్ కొన్ని గంటల్లోనే నిర్వీర్యమయ్యాయని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారీ నష్టం జరిగిందని సమాచారం.

ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. గతంలో కూడా పాకిస్థాన్, వెనెజువెలా వంటి దేశాల్లో చైనా సరఫరా చేసిన రక్షణ వ్యవస్థలపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ప్రచారంలో మాత్రం అవి అమెరికా పేట్రియట్, రష్యా ఎస్ 300లకు సమానమని చెప్పినా, ఫీల్డ్ లో మాత్రం ఫలితం ఆశించినంతగా కనిపించలేదని విశ్లేషకులు అంటున్నారు.

చైనా తయారీ ఆయుధాల గురించి ఒక వ్యంగ్య వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రోచర్ లో చూసే వరకు ఇవి అద్భుతం. యుద్ధంలో చూసే సరికి మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్తాయా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇలాంటి అంశాలు పూర్తిగా సాంకేతిక విషయాలు కూడా కావచ్చు. యుద్ధంలో విజయం లేదా వైఫల్యం అనేది ఒక్క ఆయుధంపై మాత్రమే ఆధారపడదు. వ్యూహం, శిక్షణ, సమన్వయం అన్నీ కీలకం. కానీ వరుసగా ఇలాంటి వార్తలు రావడం మాత్రం చైనా రక్షణ సామగ్రిపై అనుమానాలు పెంచుతోంది.

Related Post

Top Opening Weekend of 2025 at Box Office: Dhurandhar takes the 3rd spot; Chhaava rulesTop Opening Weekend of 2025 at Box Office: Dhurandhar takes the 3rd spot; Chhaava rules

Ranveer Singh’s latest outing, Dhurandhar, recorded a good opening weekend at the Indian box office. Released on December 5, 2025, the movie opened with Rs. 24.50 crore, followed by Rs.

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ డేట్ కోసం అప్పుడే పోటీలు పడుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్న వైనం తెరవెనుక జరుగుతోంది. ఒకవేళ పెద్ది వాయిదా లేకపోతే ఈపాటికి