అమరావతి : రాష్ట్రంలోని 2,021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (PACS) 2,017 సంఘాలను రూ.62.34 కోట్ల వ్యయంతో e-PACSలుగా మార్పు చేసి పూర్తిస్థాయి డిజిటల్ లావాదేవీలను అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మార్పుతో పారదర్శకత, వేగవంతమైన సేవలు , రైతులకు సమయానుకూల రుణ సదుపాయాలు అందుతున్నాయని చెప్పారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF) ద్వారా PACSలను బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ, 4.37 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో 780 గోదాములను నిర్మించామని వెల్లడించారు. దీని ద్వారా రైతులు తమ దిగుబడిని భద్రపరుచుకొని మంచి ధరకు అమ్ముకునే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు.
సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి 2026-27 సంవత్సరానికి రూ.209.30 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. రైతు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. MIDH కింద 2014-19లో 2.91 లక్షల హెక్టార్లు పెరగగా, 2019-24లో కేవలం 83 వేల హెక్టార్లు మాత్రమే పెరిగినట్లు పేర్కొన్నారు. 2024 నుండి ఇప్పటివరకు 1.71 లక్షల హెక్టార్లను ఉద్యాన పంటల కిందకు తీసుకు వచ్చామని తెలిపారు. 2025-26లో రూ.175 కోట్లు కేటాయించి పాత బకాయిలు కూడా చెల్లించామని చెప్పారు. ఉద్యాన రంగ GVA 2024-25లో 21% వృద్ధితో రూ.1,52,951 కోట్లకు చేరిందని వెల్లడించారు. అరటి ఎగుమతులు 1.20 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చాయని పేర్కొన్నారు.
The post సహకార రంగానికి డిజిటల్ బలం : అచ్చెన్నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సహకార రంగానికి డిజిటల్ బలం : అచ్చెన్నాయుడు
Categories: