hyderabadupdates.com movies టాక్సిక్ వెనక్కి తగ్గడం మంచిదే

టాక్సిక్ వెనక్కి తగ్గడం మంచిదే

తలచినదే జరిగినదా దైవం ఎందులకు అంటూ పాత పాట ఒకటుంది. ప్యాన్ ఇండియా సినిమాల రిలీజు వ్యవహారంలో ఇది అచ్చంగా సరిపోతుంది. 2026 బిగ్గెస్ట్ క్లాష్ అఫ్ బాక్సాఫీస్ గా ట్రేడ్ పండితులు వర్ణిస్తూ వచ్చిన మార్చి 19 మీద పెద్ద పిడుగు పడింది. టాక్సిక్ వాయిదా వేస్తూ హీరో యష్ కీలకమైన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. నిజానికి అంతా సవ్యంగా జరుగుతోంది, ఓవర్సీస్ లో టికెట్ల బుకింగ్ అవుతోంది, బెంగళూరులో ఆదివారం ట్రైలర్ లాంచ్ జరుగుతుందని వార్తలు వచ్చిన టైంలో హఠాత్తుగా ఈ పిడుగు పేల్చేశాడు యష్.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని, టాక్సిక్ జూన్ 4 ప్రేక్షకుల ముందుకు వస్తుందని యష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇది టాక్సిక్ కి అని విధాలా మేలు చేసే నిర్ణయం. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఏమంత బాలేవు. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల జనాలు సినిమాలు చూసే మూడ్ లో లేరు. దురంధర్ 2 రివెంజ్ అక్కడ ఎలాగూ బ్యాన్ అవుతుంది కాబట్టి నిర్మాతలకు టెన్షన్ లేదు. పైగా అక్కడ బ్యాన్ చేసినా కూడా వందల కోట్ల వసూళ్లు ఇతర రాష్ట్రాల్లో వచ్చాయి.

కానీ టాక్సిక్ కు అలా కుదరదు. యుఏఈ లాంటి ప్రాంతాల్లో దీనికి మంచి స్పందన ఉంటుందనే అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. ఒక్క శాతం రిస్క్ తీసుకున్నా కలెక్షన్ మీద దెబ్బ పడుతుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దురంధర్ 2 కన్నా టాక్సిక్ చాలా వెనుకబడి ఉన్న వైనం నెంబర్లలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టాక్సిక్ వెనుకడుగు వేయడం నార్త్ బయ్యర్లను హమ్మయ్య అనుకునేలా చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉన్నాయట.

అందుకే మొన్న తబాహి సాంగ్ ని ఎలాంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియో రూపంలో రిలీజ్ చేశారు. ఇప్పుడు చివరి నిమిషం దాకా ఒత్తిడి పెట్టుకుని దురంధర్ 2 వల్ల నలిగిపోవడం కంటే సేఫ్ సైడ్ జూన్ 4కి వెళ్లిపోవడం ఉత్తమమని భావించి ఉంటారు. ఇది యష్ ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేసే విషయమే అయినా బిజినెస్ కోణంలో చూసుకుంటే మంచి డెసిషన్ అని చెప్పాలి. లేదంటే ఫైనల్ రన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది.

Related Post

హాట్ టాపిక్‌: ఏపీ 2025 రాజ‌కీయాలు ఇవే… !హాట్ టాపిక్‌: ఏపీ 2025 రాజ‌కీయాలు ఇవే… !

2025 సంవత్సరంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏ విధంగా స్పందిస్తున్నారు? అనేది ఆసక్తికర విషయం. రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు. అయితే, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇందుకు తాను భిన్నం అంటున్నారు. అంతేకాదు, తప్పు చేస్తే కొట్టండి

Medical Crime Thriller ‘Others’ Set for November 7 ReleaseMedical Crime Thriller ‘Others’ Set for November 7 Release

Medical Crime Thriller ‘Others’ Set for November 7 Release The medical crime thriller ‘Others’, featuring newcomer Aditya Madhavan making his acting debut alongside established actors Gouri Kishan and Anju Kurian