hyderabadupdates.com movies రేపటి పోరు – ఇంట్రెస్టింగ్ గురూ

రేపటి పోరు – ఇంట్రెస్టింగ్ గురూ

ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల పరీక్షల సీజన్ అయినా రెగ్యులర్ గా సినిమాలు చూసే ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రేపు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కొత్త రిలీజులు ఉన్నాయి. వీటిలో ఏవి మెప్పిస్తాయనే దాన్ని బట్టే వీకెండ్ ఎవరు వాడుకుంటారనేది ఆధారపడి ఉంది. విష్ణు విన్యాసం వచ్చిన వారానికే ‘మృత్యుంజయ్’తో పలకరిస్తున్నాడు శ్రీవిష్ణు.

మొదటిసారి సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ చేయడంతో పాటు సుకుమార్ టీమ్ నుంచి వచ్చిన దర్శకుడు హుసేన్ షా కిరణ్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. సెలబ్రిటీ ప్రీమియర్ షో రిపోర్ట్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. ముందు ఓటిటి అనుకుని తర్వాత థియేటర్ కు షిఫ్ట్ అయిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూస’ని ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. శివాజీ, లయ జంటగా నటించిన ఈ కామెడీ క్రైమ్ డ్రామాకు జనాన్ని రప్పించడం కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు.

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారి తీసిన ‘ఎస్ సర్వసతి’ సైతం ఆసక్తి రేపుతోంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తామని టీమ్ అంటోంది. పెద్ద క్యాస్టింగ్, తమన్ సంగీతం లాంటివి ఆకర్షణగా నిలుస్తున్నాయి. టైటిలే వెరైటీగా అనిపిస్తున్న ‘మెన్షన్ హౌస్ మల్లేష్’తో పాటు ఆండ్రియా నటించిన డబ్బింగ్ మూవీ ‘కాన ది ఫారెస్ట్’తో పాటు కాక్రోచ్ అనే మూవీ చిన్న చిత్రం బరిలో ఉన్నాయి. వీటి బజ్ వచ్చేలా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు కాబట్టి టాక్ కీలకం కానుంది.

కాంపిటీషన్ లో ఉన్న అన్ని సినిమాలు కంటెంట్ నమ్ముకునే వచ్చాయి కాబట్టి యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకున్నవే నిలబడతాయి. వీటిలో రెగ్యులర్ ఎంటర్ టైనర్లు లేవు. సంక్రాంతి లాగా వినోదాన్ని నమ్ముకుని రావడం లేదు. అన్నీ సీరియస్ బ్యాక్ డ్రాప్స్ తోనే ఉన్నాయి. ఏదో ఒక ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ని హుక్ పాయింట్ గా పెట్టుకుని దర్శకులు తెరకెక్కించారు. మరి జనంతో టికెట్లు కొనిపించేవి వీటిలో ఏవి అవుతాయో రేపు సాయంత్రానికి ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది. నిన్న మొన్న వారం వచ్చిన సినిమాలు ఆల్రెడీ ఫైనల్ రన్ కు వచ్చిన నేపథ్యంలో రేపటి క్లాష్ లో ఎవరు విజేతలవుతారో చూడాలి. 

Related Post

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయంసెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికి దారి తీయడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సదరు అధికారికి క్షమాపణ చెబుతూ ప్రెస్

Mohan Babu’s MB50 Gala Becomes a Grand Reunion of Cinema and Political IconsMohan Babu’s MB50 Gala Becomes a Grand Reunion of Cinema and Political Icons

Collection King Dr. Mohan Babu’s 50-year celebration, MB50, turned into one of the biggest and most glamorous gatherings of the year, bringing together top stars, political leaders, and industry heavyweights

బీజేపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు.. అధిష్టానం ఆరా…?బీజేపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు.. అధిష్టానం ఆరా…?

ఏపీ బీజేపీలో నాయ‌కుల మ‌ధ్య లుక‌లుక‌లు ఉన్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌క‌పోవ‌డం.. ఒకరిపై మ‌రొక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేయ‌డం వంటివి కామ‌న్‌గా మారాయి. అయితే.. సాధార‌ణంగా ఏ పార్టీలో అయినా.. ఇలాంటి ఆధిప‌త్య రాజ‌కీయాలు ఉంటాయి. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు కూడా