hyderabadupdates.com movies కాంచనకు ఇంత ఫాలోయింగ్ ఉందా

కాంచనకు ఇంత ఫాలోయింగ్ ఉందా

హారర్, కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక్క కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కం దర్శకుడు లారెన్స్ రాఘవేంద్రకు దక్కుతుంది. తీసిన కథే మళ్ళీ మళ్ళీ తీసినా మాస్ ఆడియన్స్ అండతో హిట్లు కొట్టడం ఆయనకే చెల్లింది. చంద్రముఖి 2 తీసింది వేరే దర్శకుడైనా దాని డిజాస్టర్ ప్రభావం లారెన్స్ మీద కాస్తంత గట్టిగానే పడింది. అందుకే కొంచెం గ్యాప్ తీసుకుని ప్రస్తుతం కాంచన 4 తీసే పనిలో బిజీగా ఉన్నారు.

వచ్చే వారం మార్చి 13 కాంచన రీ రిలీజ్ కాబోతోంది. చెప్పుకోదగ్గ కొత్త మూవీస్ లేకపోవడంతో దాన్ని అవకాశంగా వాడుకుందామని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేశారు. అయితే ఈ మధ్య పాత రీ రిలీజులు అంతగా వర్కౌట్ కానీ వైనం చూస్తున్నాం. నిన్న ప్రభాస్ మున్నా వస్తే పెద్దగా రెస్పాన్స్ లేదు. రాజా సాబ్ వైఫల్యం వల్ల డార్లింగ్ ఫ్యాన్స్ కి మూడ్ లేదో లేక ఫ్లాప్ సినిమా కాబట్టి లైట్ తీసుకున్నారో ఏమో కానీ మొత్తానికి దిల్ రాజు ఊహించిన స్పందన హైదరాబాద్ బయట పెద్దగా లేదనే చెప్పాలి.

అలాంటప్పుడు కాంచన లాంటి డబ్బింగ్ మూవీ సౌండ్ చేస్తుందని ఊహించగలమా. విచిత్రం ఏమిటంటే ఇంకా ఆరు రోజుల టైం ఉండగానే కాంచన బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. గత ఇరవై నాలుగు గంటల్లో ఏడు వేలకు పైగా టికెట్లు అమ్మిందంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఉదయం త్వరగా వేసే కొన్ని షోలు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీన్ని బట్టి కాంచనకు ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీనికి కారణాలున్నాయి. లారెన్స్ డాన్స్, ఫస్ట్ హాఫ్ కామెడీ, హిజ్రాగా శరత్ కుమార్ అద్భుతమైన నటన, క్లైమాక్స్ లో చీర కట్టుకుని హీరో విలన్ ని చంపే పాట ప్లస్ ఫైట్ ఇవన్నీ పైసా వసూల్ ఎలిమెంట్సే. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇవన్నీ కూడబలుక్కుని కాంచనకు హైప్ తెస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ కాంచనని సెలెబ్రేట్ చేసుకోవడానికి మగ అభిమానులు చీరలు చున్నీలు కట్టుకొచ్చి రచ్చ చేస్తారేమోనని థియేటర్ ఓనర్లు సందేహిస్తున్నారు.

Related Post

షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా?షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. రాజ్య‌స‌భ‌కు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 2024 ఫిబ్ర‌వ‌రిలో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను చేప‌ట్టారు. అనంత‌రం.. అదే ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి పోటీ

Koragajja Audio Launch Creates Buzz in Mangaluru, Film Release SoonKoragajja Audio Launch Creates Buzz in Mangaluru, Film Release Soon

The much-awaited Kannada film Koragajja is making headlines after its grand audio launch event held in Mangaluru. The ceremony drew massive crowds and created a festive atmosphere, setting the tone