hyderabadupdates.com movies శత్రుదేశం మాఫియాలో ‘దురంధర్’ ప్రతీకారం

శత్రుదేశం మాఫియాలో ‘దురంధర్’ ప్రతీకారం

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది రివెంజ్. మొదటి భాగం రిలీజైనప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా వందా రెండు వందలు కాదు ఏకంగా పదమూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఆల్ టైం బ్లక్ బస్టర్ గా రణ్వీర్ సింగ్, ఆదిత్య ధార్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అందుకే కొనసాగింపు మీద ఇంత ఆసక్తి నెలకొంది.

ఈసారి ఏ చిన్న  అవకాశాన్ని వదలకుండా తెలుగుతో సహా అయిదు ప్రధాన భాషల్లో పార్ట్ 2 రానుంది. ముందు రోజు మార్చి 18 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్లతో దురంధర్ రివెంజ్ మొదలవుతుంది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. రెహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా) చనిపోయాక ఆ సామ్రాజ్యాన్ని పాలించే అవకాశం హంజా (రణ్వీర్ సింగ్)కు దక్కుతుంది. లియరీ డాన్ ప్రాణాలు కోల్పోయాక ఆ ప్రాంతంలో ఏర్పడిన ఊచకోత, రక్తపాతాన్ని హంజా తన చేతుల్లోకి తీసుకుంటాడు.

అయితే ఇండియాలో జస్కిరాత్ సింగ్ రంగి పేరుతో హంజాకో దారుణమైన హింసాత్మకమైన గతం ఉంటుంది. మనుషులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన చరిత్ర నుంచి పాకిస్థాన్ లో జెండా ఎగరేసే స్థాయిలో ఎలా వచ్చాడనేది దురంధర్ రివెంజ్ లో చూపించబోతున్నారు. హంజా అక్కడి నేర సామ్రాజ్యాన్ని, రాజకీయాన్ని ఎలా భూస్థాపితం చేశాడో తెలియాలంటే ఇంకో పదకొండు రోజులు ఆగాలి.

అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొత్తం యాక్షన్ విజువల్స్ తో నింపేశారు. మూడు నిమిషాల వీడియోలో చాలా ఫాస్ట్ కట్స్ ఉన్నాయి. కొన్ని అర్థం చేసుకోవాలంటే స్లో మోషన్ పెట్టుకుంటే తప్ప క్యాచ్ చేయలేం. అక్షయ్ ఖన్నా మినహాయించి మిగిలిన పాత్రలన్నీ ఇందులో కంటిన్యూ కాబోతున్నాయి.

శాశ్వత్ సచ్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించినట్టే ఇంటెన్స్ తో కొనసాగింది. మొత్తానికి రికార్డులు బద్దలయ్యే హామీ దురంధర్ ది రివెంజ్ ట్రైలర్ లో కనిపించింది. ఇప్పుడునా హైప్ ని అందుకుంటే మాత్రం ఈసారి రెండు వేల కోట్లు వసూలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాలుగు గంటల ప్యూర్ యాక్షన్ డ్రామాతో ఆదిత్య ధార్ కనువిందు చేయబోతున్నారు.

Related Post

మహేష్ సినిమా క్లైమాక్స్.. దర్శకుడు చెప్పిన సీక్రెట్మహేష్ సినిమా క్లైమాక్స్.. దర్శకుడు చెప్పిన సీక్రెట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘మురారి’ ఒకటి. కృష్ణ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలనటుడిగా అడుగు పెట్టిన అతడికి ఆ వయసులోనే స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆపై పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేసినపుడు

Rajinikanth to resume Jailer 2 schedule from January 20 shoot? Here’s what we knowRajinikanth to resume Jailer 2 schedule from January 20 shoot? Here’s what we know

Superstar Rajinikanth is currently involved in the work for his next release, Jailer 2, directed by Nelson Dilipkumar. As fans eagerly await official updates from the makers, it appears that the