hyderabadupdates.com movies మీరు హ‌ర్ట్ కావ‌ద్దు.. నేను చూసుకుంటా – విజ‌య్

మీరు హ‌ర్ట్ కావ‌ద్దు.. నేను చూసుకుంటా – విజ‌య్

త‌మిళ‌నాట టీవీకే పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్నిక‌ల పోటీకి సై అంటున్న త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజయ్‌.. ఇటీవ‌ల ఒక వ్య‌క్తిగ‌త వివాదంతో వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ నుంచి విడాకులు కోరుతున్న భార్య సంగీత‌.. అత‌డికి ఓ న‌టితో అక్ర‌మ సంబంధం ఉన్న‌ట్లు ఆరోపించింది.

ఈ ఆరోప‌ణ‌ల‌ను నిజం చేస్తూ న‌టి త్రిషతో క‌లిసి ఒక వివాహ వేడుక‌కు విజ‌య్ హాజ‌రు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజ‌య్ ఇలా చేయ‌డం క‌రెక్టేనా.. ఇది బూమ‌రాంగ్ అవుతుందా.. మ‌హిళ‌ల్లో త‌న ఇమేజ్ డ్యామేజ్ కాదా అన్న చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా.. మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని నిర్వ‌హించిన ఒక స‌మావేశంలో విజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

మ‌హిళ‌ల‌తో నిర్వ‌హించిన ఈ వేడుక‌లో త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దాని మీద న‌డుస్తున్న వివాదాల గురించి విజ‌య్ ప్ర‌స్తావించాడు.

ఈ మ‌ధ్య కొన్ని గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.. చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి తెలుసు క‌దా అంటూ ప‌రోక్షంగా ఆ టాపిక్ తీసుకొచ్చిన విజ‌య్.. దాని గురించి జ‌నం, త‌న అభిమానులు బాగా హ‌ర్ట‌యిపోవ‌డం చూసి తాను హ‌ర్ట‌వుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ వ్య‌వ‌హారాన్ని తాను హ్యాండిల్ చేసుకోగ‌ల‌న‌ని.. ఆ విష‌యం త‌న‌కు వ‌దిలేయాల‌ని విజ‌య్ అన్నాడు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారాల గురించి మనం మాట్లాడుకుందామ‌ని.. మీరంద‌రూ చింతించాల్సినంత పెద్ద విష‌యం కాద‌ని విజ‌య్ వ్యాఖ్యానించాడు. తాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న‌ట్లు కూడా ఒక సంకేతం ఇచ్చాడు విజ‌య్. మ‌రోవైపు తన పార్టీ అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల కోసం ఏం ఏం చేస్తానో చెబుతూ.. కొన్ని ఆక‌ర్ష‌ణీయ హామీలు ప్ర‌క‌టించాడు విజ‌య్.

మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామ‌ని, సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామ‌ని, ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం బ‌హుమ‌తి ఇస్తామ‌ని, మహిళలకు ఆర్థిక చేయూతగా రూ.15 వేలు అందిస్తామ‌ని, రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తామ‌ని, రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామ‌ని విజ‌య్ హామీ ప్ర‌క‌టించాడు.

Related Post

హుద్ హుద్ ప్లాన్‌ను అప్ల‌య్ చేస్తున్న చంద్ర‌బాబు!హుద్ హుద్ ప్లాన్‌ను అప్ల‌య్ చేస్తున్న చంద్ర‌బాబు!

హుద్ హుద్ తుఫాను గుర్తుందా? విశాఖ‌ను ఈ తుఫాను అత‌లాకుత‌లం చేసిన విష‌యం తెలిసిందే క‌దా! 2015లో వ‌చ్చిన హుద్ హుద్ తుఫాను తీవ్ర‌స్థాయిలో విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ను దెబ్బ‌తీసింది. ముఖ్యంగా విశాఖ‌ను చాలా తీవ్రంగా దెబ్బ‌తీసింది. అయితే ఆ

Prime Video Drops Tense Trailer of Telugu Crime Thriller CheekatiloPrime Video Drops Tense Trailer of Telugu Crime Thriller Cheekatilo

Prime Video has unveiled the gripping trailer of its upcoming Telugu original movie Cheekatilo, creating strong buzz among thriller lovers. Set against the fast-changing urban landscape of Hyderabad, the film