hyderabadupdates.com Gallery మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌

మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌

మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌ post thumbnail image

అమ‌రావ‌తి : మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనేది ఆర్యోక్తి అని, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజింప బడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం అని పేర్కొన్నారు . అందుకే అన్న దివంగ‌త‌ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి మహిళలకు సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మహిళా యూనివర్శిటీని ప్రారంభించారని అన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కు కల్పించారని ప్ర‌శంసించారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం తన పాలనలో మహిళలకు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు మంత్రి ఎస్ స‌విత‌.
విద్యా, ఉద్యోగావకాశాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అంతే కాకుండా రాజకీయాల్లోనూ ప్రాధాన్యత ఇస్తున్నార‌ని చెప్పారు. మహిళలకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా భరోసా ఇస్తూ పథకాలు రూపకల్పన చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసి, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్య కల్పించిన ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడిదేన‌ని పేర్కొన్నారు ఎస్. స‌విత‌. కట్టెల పొగతో వంటింటిలో ఉక్కిరిబిక్కిరయ్యే మహిళల కోసం దీపం పథకానికి శ్రీకారం చుట్టింది కూడా చంద్ర‌బాబేన‌ని పేర్కొన్నారు. గతంలో దీపం 1, దీపం 2 ఇపుడు దీపం 3 పథకం కింద ఏడాదిగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడకైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన ఘనత సీఎం చంద్రన్నదని అన్నారు.
The post మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

23న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు23న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.

Bhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్కBhatti Vikramarka: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు – భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు.

Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

    గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా