hyderabadupdates.com movies బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో పొత్తు.. మౌనం వీడిన బీజేపీ

బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయినప్పటికీ ఎన్నడూ ఈ రెండు ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించలేదు. కానీ, తాజాగా అసలు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రెండుసార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు ప్రజలు అవకాశమిచ్చారని, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. లేదంటే ఎంఐఎంకు హైదరాబాద్ ను కాంగ్రెస్ ధారాదత్తం చేస్తుందని రామచందర్ రావు విమర్శించారు. ఇక, బీఆర్ఎస్ తో పొత్తు లేదని, ఫ్యూచర్ తమదేనని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పారు. తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది కాబట్టి ఈ క్లారిటీ ఇస్తున్నామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

కుటుంబ పాలన కోసమా? కాళేశ్వరం కోసమా? దేనికి బీఆర్ఎస్ లో ఉండాలి అన్న భావన బీఆర్ఎస్ నేతల్లో వచ్చిందని, అందుకే బీఆర్ఎస్ నుండి బీజేపీకి వారు క్యూ కడుతున్నారని అన్నారు.

అందుకే, బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం, బీఆర్ఎస్ లోనే ఉండండి అని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్, కేటీఆర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తమ మందను కాపాడుకోవడం కోసం తండ్రికొడుకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు.

Related Post

దారుణం: ఎన్నిక‌ల్లో పోటీ కోసం… కూతుర్ని చంపేశాడు!దారుణం: ఎన్నిక‌ల్లో పోటీ కోసం… కూతుర్ని చంపేశాడు!

మ‌హారాష్ట్ర‌లో మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఇప్ప‌టికే ఈ రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసింది. ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ తెర‌మీదికి వ‌చ్చింది. కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో గ్రామీణ

ర‌ఘురామ‌పై రాళ్ల దాడి… ఏం జ‌రిగింది?ర‌ఘురామ‌పై రాళ్ల దాడి… ఏం జ‌రిగింది?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తృటిలో త‌ప్పించుకున్నారు. కానీ.. ఆయ‌న అనుచ‌రులు, ప‌లువురు టీడీపీ కార్య‌కర్త‌లు, నాయ‌కులు గాయ‌ప‌డ్డారు. వాహనాల‌పై రాళ్లు ప‌డ‌డంతో అద్దాలు స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి.