hyderabadupdates.com movies శ్రీవిష్ణు గేరు మార్చే టైమొచ్చింది

శ్రీవిష్ణు గేరు మార్చే టైమొచ్చింది

కింగ్ అఫ్ కంటెంట్ లేదా ఎంటర్ టైన్మెంట్ అని వినడానికి బాగానే ఉంది కానీ హీరో విష్ణు తన ఎంపికను విశ్లేషించుకోవాల్సిన టైం వచ్చింది. కేవలం వారం గ్యాప్ లో విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ తో థియేటర్లలో అడుగు పెట్టాడు. రెండు వేర్వేరు సంబంధం లేని జానర్లు కాబట్టి ఇబ్బంది ఉండదని భావించి ఉండొచ్చు. కానీ బాక్సాఫీస్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.

ఒకసారి ఆడియన్స్ లో నమ్మకం తెచ్చుకున్న హీరోగా సెటిలయ్యాక ఎలాంటి రిస్క్ ఉండదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అల్లరి నరేష్ ఒకప్పుడు యాభై వంద రోజుల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన గ్యారెంటీ స్టార్. కానీ ఇప్పుడు అంతా రివర్స్. హారర్, సీరియస్, మెసేజ్, కామెడీ ఇలా ఏ జానర్ టచ్ చేసినా రిజల్ట్ మాత్రం తేడా కొడుతోంది. ఆ మధ్య 12ఏ రైల్వేకాలనీకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు.

శ్రీవిష్ణు ఈ రిస్కులో పడకూడదనుకుంటే గేరు మార్చాల్సిందే. మాటలను మింగేయడాన్ని టైమింగ్ అనుకోవడం, సోషల్ మీడియా ట్రెండ్స్ తో కథలు రాసుకొస్తే ప్రతిసారి వర్కౌట్ అవుతాయని భావించడం తనను రిస్క్ లో పడేస్తున్నాయి. మృత్యుంజయ్ లో పాయింట్ బాగున్నప్పటికీ దానికి రాసుకున్న ట్రీట్ మెంట్ ని సీరియస్ గా అనాలిసిస్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా బెటర్ మూవీ అయ్యేది.

విష్ణు విన్యాసం కంటే మృత్యుంజయ్ కొంచెం బెటరనే టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడేందుకు అది సరిపోయేలా లేదు. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో ఆదివారం ఫుల్ అవుతున్న సంగతి పక్కనపెడితే చాలా బిసి సెంటర్లలో మొదటి రోజు ఆక్యుపెన్సీనే తక్కువగా నమోదైన వాస్తవాన్ని విస్మరించకూడదు. బ్యాడ్ సీజన్, క్రికెట్ మ్యాచ్ లాంటివి కేవలం ఊరట కోసం చెప్పుకునే కారణాలు.

ఇక్కడ గేరు మార్చడమంటే అర్థం స్పీడ్ పెంచమని కాదు. ప్రయోగాలు చేస్తూనే ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా తనకు సూటయ్యే కథల వైపు మొగ్గు చూపడం. సామజవరగమన, రాజరాజ చోర, బ్రోచేవారెవరురా లాంటివి ఎందుకు సక్సెస్ అయ్యాయో విశ్లేషించుకోవడం. ఇది ప్రాపర్ గా జరిగితే తిరిగి ట్రాక్ లోకి వచ్చేయొచ్చు. లేదంటే డేంజర్ జోన్ ప్రమాదం పొంచి ఉంది.

Related Post

‘సార్’ రవితేజ చేసి ఉంటే..?‘సార్’ రవితేజ చేసి ఉంటే..?

మాస్ రాజా రవితేజ తన ఇమేజ్‌కు తగ్గ మాస్ మూవీస్ చేసినపుడే ఎక్కువ సక్సెస్ అయ్యాడు. ఆయనకు డిఫరెంట్ మూవీస్ చేయాలని, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో సత్తా చాటుకోవాలని ఉంటుంది. ఆ దిశగా అప్పుడప్పుడూ ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవి వర్కవుట్ కావడం అరుదు.

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే కృష్ణా నదిపై రిసార్టుల ఏర్పాటు తేలియాడే పర్యాటక బోట్ల ఏర్పాటు విషయాన్ని ఆయన సీరియస్గా

Chiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with DextrocardiaChiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with Dextrocardia

The upcoming film “Chiranjeevi” glimpse launched today. The launch has created interest around this emotionally driven project. The makers, confident in their film’s unique concept, unveiled the glimpse at a