hyderabadupdates.com movies సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్ అని మన వాళ్లు ఎంతమాత్రం ఫీలవ్వరు. ‘ఫిదా’తో మొదలుకుని పలు చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుని గొప్ప పేరు సంపాదించింది సాయిపల్లవి. ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సాయిపల్లవిని కూడా కొందరు సోషల్ మీడియాలో అదే పనిగా టార్గెట్ చేస్తుంటారు.

కొన్నేళ్ల ముందు ఒక ఇంటర్వ్యూలో పాకిస్థాన్ వాళ్లు కూడా మన లాంటి మనుషులే.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన తన మీద నెగెటివిటీ వచ్చింది. అంతకుమించి సాయిపల్లవి ఎప్పుడూ హద్దులు దాటి మాట్లాడింది లేదు, ప్రవర్తించింది లేదు. అయినా సరే.. ఆమె మీద కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం.. ట్రోల్స్ చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. సాయిపల్లవి ప్రస్తుతం ‘రామాయణం’ లాంటి మెగా మూవీలో సీత పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ఆమె ఎంపికైన దగ్గర్నుంచి ఒక వర్గం ఆమెను టార్గెట్ చేస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి.. సీత పాత్ర చేయడం ఏంటన్నట్లుగా మాట్లాడుతోంది. ఆ వర్గం ఎంతకీ ఆమెను వదలట్లేదు. తాజాగా రామాయణంలో రణబీర్, సాయిపల్లవికి సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆ ఇద్దరూ రాముడు, సీత అవతారాల్లో కనిపిస్తున్నారు. అది ముందు లీక్డ్ పిక్ అనుకున్నారు. కానీ ఏఐ ద్వారా క్రియేట్ చేసిందని తర్వాత క్లారిటీ వచ్చింది.

ఐతే ఈ ఫొటోను పట్టుకుని సాయిపల్లవి సీత పాత్రకు మిస్ ఫిట్ అంటూ.. ఈ సినిమా తన వల్లే నాశనం కాబోతోందంటూ ఒక వర్గం అదే పనిగా దుష్ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలోకి వచ్చిన ఫొటో ఒరిజినలా కాదా అని కూడా వెరిఫై చేసుకోకుండా ఒక అజెండా ప్రకారం సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. సినిమా రిలీజ్ టైంకి ఈ వ్యతిరేక ప్రచారం ఇంకా పెద్ద స్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది. ఈ నెగెటివిటీని టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Related Post

ఫ్యూచరంతా ఫిఠాపురం నుంచేనా?ఫ్యూచరంతా ఫిఠాపురం నుంచేనా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ … ప్లాన్ మారుస్తున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని మ‌రింత బలో పేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారా? దీనికి పిఠాపురాన్ని ఆయ‌న కేంద్రంగా మార్చుకోనున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు ఎంత వ‌చ్చింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పార్టీ ప‌రంగా కాంగ్రెస్ విప‌క్ష పాత్ర