hyderabadupdates.com movies ‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. హరీష్ శంకర్ సినిమాలు గమనించినా.. చాలా వరకు ఐటెం సాంగ్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌తో హరీష్ రూపొందించిన ‘గబ్బర్ సింగ్’లో ‘కెవ్వు కేక’ అంటూ సాగే ఐటెం సాంగ్ జనాలను ఎలా ఊపు ఊపేసిందో.. సినిమాకు ఎంత ఆకర్షణగా మారిందో తెలిసిందే. 

కానీ పవన్‌తో హరీష్ చేసిన కొత్త చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ అలాంటి ఒక పాట ఆశించారు ఫ్యాన్స్. కానీ ఇప్పటిదాకా అలాంటి పాట ఉన్న సంకేతాలేమీ కనిపించలేదు. తర్వాత కూడా అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని హరీష్ శంకర్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టకూడదని ముందే నిర్ణయం తీసుకున్నట్లు హరీష్ వెల్లడించాడు.

‘గబ్బర్ సింగ్’ చేసే సమయానికి పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత. పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా. ఆ హోదాలో ఉంటూ.. ఐటెం సాంగ్స్ లాంటివి చేయడం ఆయన స్థాయికి తగదు.

అందుకే అలాంటి పాట ఏదీ పెట్టలేదని హరీష్ స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్ ఒక ఐటెం గర్ల్ వెనుక పడుతూ.. పాటలు పాడితే చూడ్డానికి బాగుండదని.. ఉప ముఖ్యమంత్రి హోదాకు గౌరవం ఇవ్వాలని.. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఐటెం సాంగ్ పెట్టలేదని హరీష్ వెల్లడించాడు. 

రీఎంట్రీలో పవన్ చేసిన సినిమాలు వేటిలోనూ నిఖార్సయిన ఐటెం సాంగ్ లేదు. ‘హరిహర వీరమల్లు’లో మాత్రం అనసూయ, పూజిత పొన్నాడలతో కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేశాడు పవన్. దాన్ని కూడా ఐటెం సాంగ్ గాటన కట్టలేం. ఇక ముందు కూడా పవన్ ఆ తరహా పాటలు చేసే అవకాశం లేనట్లే.

Related Post

సూప‌ర్ ఫ‌న్ కాంబో మ‌ళ్లీసూప‌ర్ ఫ‌న్ కాంబో మ‌ళ్లీ

యువ క‌థానాయ‌కుడు శ్రీ విష్ణు కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌. ఎక్కువగా సీరియ‌స్ సినిమాలు చేస్తూ వ‌చ్చిన అత‌ను.. ఈ సినిమా త‌ర్వాత ఎంట‌ర్టైన‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయాడు. త‌న చివ‌రి చిత్రం సింగిల్‌కు కింగ్ ఆఫ్ ఎంట‌ర్టైన్మెంట్ అని