hyderabadupdates.com Gallery జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్

జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్

జ‌స్ప్రీత్ బుమ్రా  ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ post thumbnail image

అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ ను అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ లో 96 ప‌రుగుల భారీ తేడాతో మ‌ట్టి క‌రిపించింది. గ‌తంలో ఉన్న రికార్డుల‌ను తిర‌గ రాసింది. టాస్ ఓడిన భార‌త్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 255 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కీవీస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది. టోర్నీలో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ రెచ్చి పోయాడు. కేవ‌లం 18 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు.
ఇదే స‌మ‌యంలో ఈ టోర్నీలో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు పొందిన కేర‌ళ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ రికార్డు బ్రేక్ చేశాడు. త‌ను మ‌రోసారి సూప‌ర్ షో చేశాడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో విండీస్ తో 97 ప‌రుగులు చేసి ఒంటిచేత్తో సెమీస్ కు చేర్చాడు. ఇదే క్ర‌మంలో ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ కు చుక్క‌లు చూపించాడు. త‌ను 89 ర‌న్స్ చేశాడు. తాజాగా న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. 8 సిక్సులు 5 ఫోర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 89 ర‌న్స్ చేశాడు. ఇషాన్ కిష‌న్ 54 ప‌రుగులు చేస్తే శివ‌మ్ దూబే 26 ప‌రుగుల‌తో షాక్ ఇచ్చాడు. అనంత‌రం 256 ప‌రుగుల భారీ స్కోర్ ను ఛేదించే క్ర‌మంలో న్యూజిలాండ్ బొక్క బోర్లా ప‌డింది. 159 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇండియ‌న్ స్పీడ్ స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా త‌న స‌త్తా ఏమిటో చూపాడు. 4 ఓవ‌ర్లు వేసి కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. త‌ను ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపిక‌య్యాడు.
The post జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌

Kiran Majumdar Shaw : బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా (Kiran Majumdar Shaw) ఇటీవల ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భారత్‌ లో

శ్రీ‌ సీతా రాముల‌ కల్యాణానికి శ్రీవారి ల‌డ్డూలు సిద్ధంశ్రీ‌ సీతా రాముల‌ కల్యాణానికి శ్రీవారి ల‌డ్డూలు సిద్ధం

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏప్రిల్ 01వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్

ఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రిఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రి

హైద‌రాబాద్ : వాహ‌న దారుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్. లెర్నర్ లైసెన్స్‌కు ముందు ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్షను త‌ప్ప‌నిస‌రి చేసింది . దీంతో వాహ‌నదారుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. దరఖాస్తుదారుల కోసం మూడు గంటల అవగాహన మాడ్యూల్‌ను