hyderabadupdates.com Gallery మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం

మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం

మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప‌దే ప‌దే మూసీ రాగం ఎత్తుకున్నారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. దీని ద్వారా ఈ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్ శివరాంపల్లిలో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించి , అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి ప్రారంభించి ప్ర‌సంగించారు. ప్రజలకు అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని చెప్పారు.
హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరించిన ప్రాంతాల్లో నైట్ ఎకానమీ కొనసాగే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పౌరులకు మంచి వాతావరణం కల్పించామ‌ని, ఇక్కడ ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేసుకోవడానికి సౌక‌ర్యంగా ఉండేలా తీర్చిదిద్ద‌డం జ‌రిగింద‌న్నారు సీఎం. ఇక్క‌డ‌ లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అన్నారు. అలాగే, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ లేక్స్ వద్ద స్టాల్స్ పెట్టి స్థానికులు పాలు, పండ్లు, కూరగాయలు పరిశుభ్రమైన వాతావరణంలో అమ్ము కోవడానికి వీలు కల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి.
99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హైదరాబాద్‌లో అనేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ రాక్స్, లేక్స్ తో ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఉండిందన్నారు. ఈ నగరం మనది. దీన్ని రక్షించు కోవాల్సిన‌ బాధ్యత కూడా అందరిపైన ఉందన్నారు సీఎం. ఈ మహానగరానికి పూర్వ వైభవం తీసుకు రావాలన్న సంకల్పంతో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను తొలగించే కార్యక్రమం చేపట్టాం అన్నారు.
ఇది ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ఈ సిటీని అభివృద్ధి చేయడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టాం అన్నారు. రెండు రోజుల కిందట కొత్వాల్‌గూడ్ ఎకో పార్క్‌ను ప్రారంభించుకున్నాం. సాధ్యమైన తొందరగా మెట్రో విస్తరణ పనులను పూర్తి చేస్తాం. మిరాలం ట్యాంక్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. పక్కనే హైకోర్టు నూతన భవన నిర్మాణం సాగుతోంది. ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం అన్నారు.
హైదరాబాద్ అత్యంత పురాతన, ప్రాముఖ్యత కలిగిన నగరం అని, ఆ ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం అన్నారు సీఎం.
The post మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రామ్ గోపాల్ వ‌ర్మా క‌ల‌కాలం వ‌ర్దిల్లు..!రామ్ గోపాల్ వ‌ర్మా క‌ల‌కాలం వ‌ర్దిల్లు..!

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్రసీమ‌లో త‌ను ఓ ట్రెండ్ సెట్ట‌ర్. తీసిన తొలి సినిమాతోనే షేక్ చేసిన వ్య‌క్తి. అత‌నే రామ్ గోపాల్ వ‌ర్మ అలియాస్ ఆర్జీవి. త‌ను ఏప్రిల్ 7న‌, 1962లో పుట్టాడు. నేటికీ ఏదో ఒక అంశంపై

8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అమరావతి : ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36