hyderabadupdates.com Gallery స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు

స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు

స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులందాయి. స్మ‌శానం వైపు చూడాలంటేనే వెనుక‌డుగు వేస్తాం.. అలాంటిది వాటిని క‌బ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు క‌బ్జా కాకుండా కాపాడాల‌ని ఫిర్యాదులందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులను చూస్తే ముచ్చ‌టేస్తోంద‌ని.. మా ప్రాంతంలోని చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని ప‌లువురు ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు. ముందుగా మురు గునీటిని బ‌య‌ట‌కు పంపి గుర్ర‌పుడెక్క‌ను వ‌దిలించాల‌ని కోరారు. గొలుసుక‌ట్టు చెరువుల మాదిరి అభివృద్ధి చేసి.. వ‌ర‌ద ముప్పు లేని న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని కాల‌నీవాసులు, సంక్షేం సంఘం ప్ర‌తినిధులు హైడ్రాకు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించారు. ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి, సంబంధిత అధికారుల‌కు ప‌రిష్కార బాధ్య‌త‌లు అప్ప‌గించారు.
యూసుఫ్‌గూడ‌, మ‌ధురాన‌గ‌ర్ ప్రాంతాల్లో ఉన్న కృష్ణాకాంత్ పార్కులో చెరువును అభివృద్ధి చేయాల‌ని వాక‌ర్స్ అసోసియేష‌న్ హైడ్రాను కోరారు. గ‌తంలో ఉన్న చెరువును చాలా వ‌ర‌కూ పూడ్చేసి పార్కును చేశార‌ని.. ఇప్పుడున్న చెరువును కొంత‌మేర విస్త‌రిస్తే చాలా వ‌ర‌కు వ‌ర‌ద క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. పార్కులో ఇప్పుడున్న చెరువు నిర్వ‌హ‌ణ క‌రువై దుర్గంధ భ‌రితంగా మారింద‌ని వాపోయారు కాల‌నీ వాసులు. ఈ చెరువులో స్వ‌చ్ఛ‌మైన నీరు చేరితే భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయ‌ని అన్నారు. ఈ వేస‌వి కాలంలోనే చెరువు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని కోరారు.
ఇక శేరిలింగంపల్లి పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్-1 కాలనీలో పార్క్ నం.4 భూమిని కొంద‌రు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కాలనీకి ఆనుకుని ఉన్న భూమి యజమానులమని చెప్పుకుంటూ 20 ఏళ్ల క్రితం నిర్మించిన బౌండరీని ధ్వంసం చేసి పార్క్ భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆక్రమణదారులు పార్క్ కంపౌండ్ వాల్‌లో కొంత భాగాన్ని కూల్చివేయడంతో ప్రస్తుతం పార్క్ భూమి రక్షణ లేకుండా ఉందని పేర్కొన్నారు. వెంటనే పార్క్ ని కాపాడాలని కోరారు.
The post స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దిన‌క‌ర్పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దిన‌క‌ర్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌జా పాల‌న కొన‌సాగిస్తోంద‌న్నారు ఏపీ 20 సూత్రాల కార్య‌క్ర‌మాల అమ‌లు చైర్మ‌న్ లంకా దిన‌క‌ర్. శ‌నివారం శాస‌న స‌భ‌లో ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ 2026-2027 ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసాఅన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

అమ‌రావ‌తి : రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.6,000ను

Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటనMinister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన

    దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కూటమి