hyderabadupdates.com Gallery ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు

ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు

ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు post thumbnail image

అమరావతి : ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటి ఎలాంటి ప్రభావం ఉందోననే అంశంపై నిరంతరం పరిశీలించాలని సీఎం సూచించారు. యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖతో సంప్రదించి ప్రవాసాంధ్రుల క్షేమంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంతో పాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని అన్నారు. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ సరఫరా, పాఠశాల, ఉన్నత విద్య, ఇసుక సరఫరా లాంటి అంశాలపై సమీక్షించారు. ప్రస్తుత ఏడాదిలో విద్యుత్ వినియోగం గరిష్టంగా 14,013 మెగావాట్లకు చేరుకుందని అధికారులు వివరించారు. విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎనర్జీ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి డిస్కంలను ఆదేశించారు. ఈ విషయంలో వినియోగదారులకు పూర్తి సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిస్కంలకు సూచించారు. అటు పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన అంశాల్లో సిలబస్, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన తరగతి గదులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తృణ ధాన్యాలతో చిక్కీ లాంటి పౌష్టికాహారం అందించే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ఉగాది పండుగ‌కు రెండున్న‌ర ల‌క్షల గృహ ప్ర‌వేశాలు చేయాల‌ని అన్నారు.
The post ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలుప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన స్థ‌లాల‌లో ఆక్ర‌మ‌ణ‌లకు పాల్ప‌డ‌డ‌మే కాకుండా బ‌హుళ అంత‌స్తులు నిర్మించ‌డంపై ఫోక‌స్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌లు సృష్టించారు క‌బ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్‌తో

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారువిద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

కృష్ణా జిల్లా : రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైత‌న్య కాలేజీల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల సంఖ్య‌. తాజాగా కృష్ణా జిల్లా లోని పెన‌మ‌లూరు పోరంకిలో చ‌దువుకుంటున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ చేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం

అరుణాచ‌ల్ సీఎంపై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు ఆదేశంఅరుణాచ‌ల్ సీఎంపై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం ఫెమా ఖండు ఆధ్వ‌ర్యంలో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సీబీఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది.