hyderabadupdates.com movies నాగచైతన్య.. అరాచకమైన మేకోవర్..

నాగచైతన్య.. అరాచకమైన మేకోవర్..

నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్‌లో, లవర్ బాయ్‌గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ‘వృషకర్మ’ సినిమా కోసం చైతన్య ఏ రేంజ్‌లో కష్టపడుతున్నారో ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. ‘బీయింగ్ అర్జున్’ అంటూ జిమ్‌లో కసరత్తులు చేస్తూ దిగిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్య కెరీర్‌లోనే ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ ఫొటోలో చైతన్య సిక్స్ ప్యాక్ బాడీతో, పక్కాగా తీర్చిదిద్దిన కండలతో చాలా రగ్గడ్‌గా కనిపిస్తున్నారు. చేతిలో డంబెల్స్ పట్టుకుని, గడ్డంతో ఉన్న లుక్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు. కేవలం బాడీ బిల్డింగ్ మాత్రమే కాకుండా, ఆ కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ ‘వృషకర్మ’లోని మిస్టరీ ఎలిమెంట్స్‌కు పక్కాగా సెట్ అయ్యేలా ఉంది.

సాధారణంగా నాగచైతన్య సినిమాల్లో మేకోవర్ అంటే హెయిర్ స్టైల్ లేదా డ్రెస్సింగ్ మార్చడం వరకే ఉండేది. కానీ ‘వృషకర్మ’ విషయంలో రూట్ మార్చారు. అతీంద్రియ శక్తులు, పురాతన రహస్యాల చుట్టూ తిరిగే ఈ కథలో తన పాత్రకు ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా అవసరమని గుర్తించి జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తున్నారు. ఈ సినిమాలో అతను పోషిస్తున్న ‘అర్జున్’ పాత్ర ఎంతటి సవాళ్లను ఎదుర్కోబోతోందో ఈ ఫిజిక్ చూస్తేనే అర్థమవుతోంది. అజనీష్ లోక్‌నాథ్ అందించిన ‘ది రైజ్ ఆఫ్ వృషకర్మ’ అనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ పోస్ట్‌కు మరింత ఎలివేషన్ ఇచ్చింది.

ఇక ఈ ఫొటో చూసిన అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘యువ సామ్రాట్ కాస్తా ఇప్పుడు మాస్ సామ్రాట్‌గా మారిపోయాడు’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ‘విరూపాక్ష’తో బాక్సాఫీస్‌ను వణికించిన కార్తీక్ దండు ఇప్పుడు చైతన్యతో కలిసి మరో విజువల్ వండర్‌ను ప్లాన్ చేశారని ఈ పోస్టర్ భరోసానిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో పాటు చైతన్య పర్సనల్ ఎఫర్ట్ కూడా తోడవ్వడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ చివరి దశలో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పటికే భారీ ధరకు థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడంతో ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా హాట్ కేక్‌లా మారింది. ఈ సమ్మర్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related Post

Confirmed: Bollywood heroine to romance Lokesh Kanagaraj in his acting debutConfirmed: Bollywood heroine to romance Lokesh Kanagaraj in his acting debut

Sensational filmmaker Lokesh Kanagaraj has been subjected to trolls ever since Rajinikanth’s Coolie was released. The biggie was one of the most-hyped projects in South cinema, but unfortunately, the content

వారణాసి బ్రాండుతో ‘బ్లఫ్’ ప్రచారంవారణాసి బ్రాండుతో ‘బ్లఫ్’ ప్రచారం

ఒక టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా చేయడం వల్ల ఎంత గొప్ప ప్రయోజనం ఉంటుందో ప్రియాంకా చోప్రాకు అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్ కోసం తను నటించిన ది బ్లఫ్ ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా