hyderabadupdates.com movies నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా, సాయంత్రం అల్లు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోకాపేట్ లోని మల్టీప్లెక్స్ ని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించబోతున్నారు. ఒకే రోజు ఇవి జరగడం పట్ల మూవీ లవర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రత్యేకమైన కారణాలు లేకపోలేదు.

తెలుగు రాష్ట్రానికి నెట్ ఫ్లిక్స్ రావడమనేది ఓటిటి రంగానికి సంబంధించి చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఇకపై కంటెంట్ జనరేషన్ అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. ఒప్పందాలు, ఆ సంస్థ తీసే సినిమాల నిర్మాణాలు, చర్చలు మొదలైన వాటికి భాగ్యనగరాన్ని వేదికగా చేసుకుంటారు. ముంబై నిర్మాతలైనా సరే ఇక్కడికి వచ్చే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంతే కాదు వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీస్ వగైరాలన్నీ అధిక శాతం ఇక్కడ షూట్ చేసేందుకే ప్రాధాన్యం ఇస్తుంది.

భవిష్యత్తులో నెట్ ఫ్లిక్స్ స్టూడియోల విస్తరణకు కావాల్సిన సహకారం, స్థలం ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి ఈ రూపంలో హైదరాబాద్ కో బ్రాండ్ తోడైనందుకు సంతోషంగా ఉన్నారు. ఇక అల్లు సినిమాస్ విషయానికి వస్తే ఏపీ, తెలంగాణలోని మొదటి డాల్బీ సినిమా థియేటర్ ఇందులో ప్రారంభం కాబోతోంది. ఇప్పటిదాకా సినీ ప్రియులు ఎప్పుడూ చూడని గొప్ప అనుభూతిని ఈ డెబ్భై అడుగుల తెరమీద చూడబోతున్నారు. స్క్రీన్ డిటైలింగ్ మతిపోయే స్థాయిలో ఉంటుంది.

ఏఎంబి, అల్లు సినిమాస్, ఏఏఏ, ఐనాక్స్ పిఎక్స్ఎల్ లాంటి ప్రీమియం ఫార్మాట్లు హైదరాబాద్ రావడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. దీని వల్ల పోటీ పెరిగి ఇతర థియేటర్లు, మల్టీప్లెక్సులు క్వాలిటీ పెంచి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పటికే దేవి 70 ఎంఎం లాంటి వింటేజ్ సింగల్ స్క్రీన్లు రినోవేషన్ చేసుకుంటున్నాయి. త్వరలో ఐమాక్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ ట్రెండ్ కొనసాగితే కేవలం సినిమాలు చూసేందుకే హైదరాబాద్ కు వచ్చే జనాలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related Post

లేటు వయసులో నయన్ ‘తెలుగు’ ప్రేమలేటు వయసులో నయన్ ‘తెలుగు’ ప్రేమ

నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగడం.. అవకాశాలకు లోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే మధ్యలో కొన్నేళ్లు ఆమె కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే

My face doesn’t pull crowds to the theatres: Telugu hero’s bold admissionMy face doesn’t pull crowds to the theatres: Telugu hero’s bold admission

Masoodha, actor Thiruveer’s new film, The Great Pre-Wedding Show, is hitting the big screens tomorrow. Rahul Srinivas is the writer and director. Teena Shravya, who appeared in Committee Kurrollu, plays