hyderabadupdates.com Gallery శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనం

శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనం

శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనం post thumbnail image

తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మార్చి 24వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా మార్చి 24న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదిలా ఉండ‌గా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. 27న ప్రారంభం కానున్న శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు.
ఇదిలా ఉండ‌గా ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంను వీక్షించేందుకు వేలాది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో, వారి సౌకర్యార్థం కల్యాణ వేదిక పరిసరాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం,ఆలయ పరిసరాల్లో 23 ఎల్.ఈ.డి వీడియో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని కనులారా వీక్షిస్తూ భక్తి పరవశంలో తేలియాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, జేఈవో వి. వీరబ్రహ్మం ఆదేశాలతో ఎలక్ట్రికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్.ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, డీఈలు రవిశంకర్ రెడ్డి, సరస్వతి, డిప్యూటీ ఈఈ మురళీకృష్ణ, తదితర అధికారులు, సిబ్బంది విద్యుత్ అలంకరణలను సిద్ధం చేస్తున్నారు.
The post శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణతిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమ‌ల : తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు

జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళంజ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వానికి ప‌వ‌న్ రూ. 2 కోట్లు విరాళం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం, జన‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీకి సంబంధించి క్రియాశీల‌క స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న

Ajit Pawar: మహారాష్ట్ర మంత్రుల మెడకు భూ కుంభకోణం ఉచ్చు ?Ajit Pawar: మహారాష్ట్ర మంత్రుల మెడకు భూ కుంభకోణం ఉచ్చు ?

    మహారాష్ట్రలో మంత్రులకు సంబంధం ఉన్న భూమి కొనుగోలు వ్యవహారాలు వెలుగులోకి రావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇవి కేవలం కొనుగోళ్లు కావని, కుంభకోణాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, రవాణా మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌లపై ఆరోపణలు వస్తున్నాయి. తొలుత