hyderabadupdates.com Gallery అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్ర‌సంగించారు. వివిధ అంశాల్లో జరిగిన ప్రగతిని ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాల్లో కొన్ని కీలక సూచనలు చేశారు. డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయ సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేస్తున్నాం అన్నారు. దీని కోసం మహిళా దినోత్సవం రోజున లోగోను కూడా ఆవిష్కరించాం అని తెలిపారు. మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో… డ్వాక్రా ఉత్పత్తులకూ అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం.
అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అమూల్ పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తోందని చెప్పారు. స్వయంలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం ఉంద‌న‌న్నారు. బిలియన్ డాలర్ల కంపెనీకి ఉన్నంత క్రెడిబులిటీ డ్వాక్రా మహిళలకు ఉందన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారని ఆ న‌మ్మ‌కం నిజ‌మైంద‌న్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు వస్తాయన్నారు. ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుందన్నారు సీఎం. బ్రాండ్ లేకపోతే ఉత్పత్తి విలువ సగానికి తగ్గిపోతుందన్నారు. గ్లోబల్ మార్కెట్టుకు చేరేలా డ్వాక్రా ఉత్పత్తుల ప్రమాణాలు పెరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ ఉత్పత్తులకు ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ కూడా ఉండేలా చూడాలన్నారు.
The post అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: ‘ఆసియాన్‌’ సదస్సుకు వర్చువల్‌ గా హాజరుకానున్న ప్రధాని మోదీPM Narendra Modi: ‘ఆసియాన్‌’ సదస్సుకు వర్చువల్‌ గా హాజరుకానున్న ప్రధాని మోదీ

PM Narendra Modi : మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ దాకా జరుగనున్న అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌(ఆసియాన్‌) 22వ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్

తిరుమల : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Robbery in Bengaluru: బెంగుళూరులో క్యాష్ వ్యాన్ ను లూటీ చేసి రూ.7 కోట్లతో పరారీRobbery in Bengaluru: బెంగుళూరులో క్యాష్ వ్యాన్ ను లూటీ చేసి రూ.7 కోట్లతో పరారీ

    కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలు నడిరోడ్డుపై భారీ దొంగతనం జరిగింది. పన్ను అధికారులమంటూ వచ్చిన దుండగులు… ఏటీఎంలో డబ్బులు నింపే క్యాష్ వ్యాన్ ను అడ్డగించి ఏడు కోట్ల రూపాయలతో పరారీ అయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…