hyderabadupdates.com movies ఇంకెన్ని ఫీట్లు సాధిస్తావయ్యా దురంధర్

ఇంకెన్ని ఫీట్లు సాధిస్తావయ్యా దురంధర్

బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక విచిత్రం గమనించవచ్చు. దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. సీక్వెల్ వచ్చే వారం విడుదలవుతున్న సందర్భంగా మొదటి భాగాన్ని వెయ్యికి పైగా స్క్రీన్లలో మళ్ళీ విడుదల చేశారు. కేవలం వంద రోజుల గ్యాప్ లోనే వచ్చేయడంతో ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్లకు షాక్ ఇస్తూ దురంధర్ గత ఇరవై నాలుగు గంటల్లో అయిదు వేలకు పైగా టికెట్లు అమ్మడం గమనార్హం. ఇది చాలా అరుదుగా చూసే ఫీట్.

ఇక దురంధర్ ది రివెంజ్ సంగతి తెలిసిందే. రోజుకు నలభై వేలకు తగ్గకుండా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కౌంటర్ బుకింగ్స్, డిస్ట్రిక్ట్ యాప్ సేల్స్ ఇందులో యాడ్ కాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ పోటీ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ దురంధర్ రివెంజ్ మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. దాన్ని చూడడానికి ముందు మరోసారి ఫస్ట్ పార్ట్ చూడాలన్న ఉద్దేశంతో నిర్మాతలు వేసిన ఎత్తుగడ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ముఖ్యంగా నగరాల్లో దీనికి రెస్పాన్స్ బాగుంది.

రిలీజ్ ఇంకా అయిదు రోజుల దూరంలో ఉండగానే దురంధర్ రివెంజ్ ఇన్నేసి ఫీట్లు సాధించడం మాములు విషయం కాదు. కేవలం ప్రీమియర్లతోనే నలభై కోట్లకు పైగా రాబట్టిన ఈ క్రేజీ సీక్వెల్ మొదటి షో పడేనాటికి ఎవరూ టచ్ చేయలేని రికార్డు అందుకోవడం ఖాయంగా ఉంది. టీమ్ ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం హైదరాబాద్ వచ్చి ప్రీమియర్ షోలో పాల్గొనమ్మన్న కొందరి అభ్యర్థనకి దర్శకుడు ఆదిత్య ధార్ సున్నితంగా నో చెప్పారట.

మొదటి రోజు ఎంత కలెక్షన్ నమోదవుతుందనేది ఎవరి ఊహకు అందటం లేదు. మార్చి 19 నుంచే నడిచే షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ నుంచి ప్రారంభించారు. నాలుగు గంటల నిడివి ఉందని తెలిసి కూడా టాక్, రివ్యూస్ చూసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున దురంధర్ రివెంజ్ మీద జనం ఆసక్తి చూపించడం విశేషమే. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్న ఆకాశమే హద్దుగా రికార్డులు బద్దలు కావడం ఖాయం. బ్లాక్ బస్టర్ అయితే ఈసారి టార్గెట్ ఖచ్చితంగా రెండు వేల కోట్లే.

Related Post

Megastar’s mayhem: Mana Shankara Varaprasad Garu set for million-dollar premiere in the USAMegastar’s mayhem: Mana Shankara Varaprasad Garu set for million-dollar premiere in the USA

Megastar Chiranjeevi’s upcoming family entertainer Mana Shankara Varaprasad Garu will hit the big screens with paid premieres on Sunday. The film is directed by Anil Ravipudi and features Nayanthara as