hyderabadupdates.com Gallery శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు post thumbnail image

తిరుపతి/ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్చి 16 నుండి నిత్య అన్న ప్రసాదం వితరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీటీడీలోని అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్ప‌ష్టం చేశారు.
అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నిత్య అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించ నున్నట్లు తెలిపారు. అనంతరం జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం అధికారులతో కలిసి ఆలయ నాలుగు మాడ వీధులు, నిత్య అన్నప్రసాద భవనం, శ్రీ సీతారాముల కల్యాణ వేదికలను పరిశీలించి పలు సూచనలు చేశారు. తదుపరి టీటీడీ, జిల్లా అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ టి.వి.సత్యనారాయణ, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శివప్రసాద్, సెల్వం, డీఈ (ఎలక్ట్రికల్) రవి శంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండ‌గా శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం జేఈవో మీడియాతో మాట్లాడారు. భారీ ఎత్తున ఈ ఉత్స‌వాల‌కు భ‌క్తులు హాజ‌ర‌వుతార‌ని , ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఏఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చూస్తామ‌న్నారు.
The post శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలిటీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలి

మంగ‌ళ‌గిరి : రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడుల‌కు దిగ‌వ‌ద్ద‌ని , కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. సోమ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , సీఎం

గాడి తప్పిన కాంగ్రెస్ పాల‌న జ‌నం ఆందోళ‌నగాడి తప్పిన కాంగ్రెస్ పాల‌న జ‌నం ఆందోళ‌న

హైద‌రాబాద్ : అడ్డ‌మైన హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ జ‌నం పాలిట శాపంగా మారింద‌ని మండిప‌డ్డారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.

డ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యతడ్వాక్రా సభ్యులకు నీటి నాణ్యత పరీక్ష బాధ్యత

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చాం అన్నారు. ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నాం