hyderabadupdates.com Gallery టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్

టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్

టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రానికి సంబంధించి సినిమా టికెట్ రేట్ల‌ను పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి సీఎస్ అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా 10 రోజుల పాటు మూవీ టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు వీలు క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు కూడా అనుమ‌తి ఇచ్చిన‌ట్ల తెలిపింది స‌ర్కార్. పెరిగిన రేట్ల‌కు సంబంధించి చూస్తే సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100 , మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. మార్చి 19న బెనిఫిట్ షోకు అనుమ‌తి ఇచ్చింది. ఈ షో టికెట్ ధ‌ర రూ. 500 కావ‌డం తో ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ త‌గ‌ల‌నుంది.
ఇదిలా ఉండ‌గా పవన్ కళ్యాణ్, శ్రీ‌లీల న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసి U/A సర్టిఫికేట్ పొందింది. ఇక‌ తెలంగాణలో తయారీదారులు టికెట్ల పెంపు లేకుండా సాధారణ జీఓ ధరలకు కట్టుబడి ఉంటారు. మార్చి 18న ప్రీమియర్ షోలు కూడా ఉండవు. ఇక 19వ తేదీ ఉదయం నుండి షోలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ థియేటర్లు ఉదయం 4–5 గంటల నుండి షోలను ప్లాన్ చేస్తుండగా, తెలంగాణ థియేటర్లు ఉదయం 7 గంటల నుండి షోలను ప్రారంభిస్తాయి. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ . 2012 బ్లాక్‌బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హ‌రీష్ , ప‌వ‌న్ తో క‌లిసి చేస్తున్న రెండ‌వ సినిమా ఇది.
The post టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బ‌డ్జెట్రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బ‌డ్జెట్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ 2026-2027 సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక బ‌డ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన

గ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడుగ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఆరా తీసిన అయ్య‌న్న‌పాత్రుడు

అమ‌రావ‌తి : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ

జ‌పాన్, జ‌ర్మ‌నీ దేశాల‌లో న‌ర్సింగ్ కు ఫుల్ డిమాండ్జ‌పాన్, జ‌ర్మ‌నీ దేశాల‌లో న‌ర్సింగ్ కు ఫుల్ డిమాండ్

ఖ‌మ్మం జిల్లా : జపాన్, జ‌ర్మ‌నీ దేశాల‌లో న‌ర్సింగ్ కు ఫుల్ డిమాండ్ ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగా ఆయా దేశాల‌కు సంంధించిన భాష‌ల‌ను న‌ర్సింగ్ కోర్సు చేస్తున్న విద్యార్థినుల‌కు నేర్పిస్తామ‌ని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం