hyderabadupdates.com Gallery ప్లాన్ లేకుండా పిల్ల‌ల‌ను కంటే ఎలా..?

ప్లాన్ లేకుండా పిల్ల‌ల‌ను కంటే ఎలా..?

ప్లాన్ లేకుండా పిల్ల‌ల‌ను కంటే ఎలా..? post thumbnail image

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ విలక్ష‌ణ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ప్ర‌త్యేకించి సెక్స్ గురించి ప్ర‌స్తావించారు. ఇండియాకు స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతున్నా ఇంకా సెక్స్ గురించి మాట్లాడ‌టం వింత‌గా చూస్తారంటూ పేర్కొన్నారు. తాజాగా వ‌ర‌లక్ష్మి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. భారతదేశంలో సెక్స్ గురించి మాట్లాడటం ఇప్పటికీ నిషిద్ధమని అన్నారు. ఇదే స‌మ‌యంలో ప్రణాళిక లేకుండా చాలా మంది పిల్లలను కంటున్నారంటూ మండిప‌డ్డారు. ఆర్థిక స్థిరత్వం కావాలంటే భారీ ఎత్తున పిల్ల‌ల‌ను క‌నాలంటూ ఈ మ‌ధ్య ప‌లువురు నేత‌లు పేర్కొంటున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్.
ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారారు న‌టి. ఇటీవలే ఎస్. సరస్వతితో దర్శకురాలిగా అడుగు పెట్టిన నటి, ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకుంది. దేశంలో పెద్ద జనాభా ఉన్నప్పటికీ సెక్స్ , కుటుంబ నియంత్రణ గురించి చర్చలు నిషిద్ధంగా ఉన్నాయని వరలక్ష్మి అభిప్రాయ‌ప‌డ్డారు. మనం సెక్స్ గురించి ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని దేశంలో ఉన్నామన్నారు. అయినప్పటికీ జనాభాలో మనం నంబర్ వన్. స్పష్టంగా, ప్రజలు దానిని కలిగి ఉన్నారంటూ ఎద్దేవా చ‌శారు. కానీ వారు దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. నాకు అది చాలా ఫన్నీగా అనిపిస్తుందంటూ పేర్కొన్నారు.
సెక్స్ అనేది పాపం కాద‌ని దానిని స‌రిగా అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్. అయితే ఒక ప్ర‌ణాళిక లేకుండా, ఆర్థిక స్థిర‌త్వం లేకుండా పిల్ల‌ల‌ను ఎలా కంటారంంటూ ప్ర‌శ్నించారు .ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు.
The post ప్లాన్ లేకుండా పిల్ల‌ల‌ను కంటే ఎలా..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి !Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి !

    బీహార్‌ లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివాహ

హార్దిక్ పాండ్యా దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై చ‌ర్య‌లు..?హార్దిక్ పాండ్యా దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై చ‌ర్య‌లు..?

ముంబై : ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ గుర్రుగా ఉందా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ జ‌రిగింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 195 ర‌న్స్

Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతుBonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతు

Bonthu Rammohan : జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపికపై బీజేపీలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాజీ మేయర్‌ కాంగ్రెస్‌ ఉపాధ‍్యక్షుడు బొంతు రామ్మోహన్‌ (Bonthu Rammohan) పేరును ఎంపీ అర్వింద్‌ ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ ను పార్టీలోకి