hyderabadupdates.com Gallery నెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలి

నెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలి

నెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలి post thumbnail image

న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారాడు దేశ వ్యాప్తంగా. త‌ను కీల‌క‌మైన అంశాల గురించి ఏకి పారేశాడు పార్ల‌మెంట్ సాక్షిగా. ఆయ‌న సంధించిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తున్నాయి. త‌ను వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక మౌనంగా ఉండి పోయారు ప్ర‌ధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు, బాలిక‌లు, విద్యార్థినుల గురించి ప్ర‌స్తావించాడు. ప్యాడ్లు, నీరు, ప్రైవసీ లేక అమ్మాయి స్కూల్ మిస్ అయితే అది ఆమె సమస్య కాద‌న్నారు. ఇది పూర్తిగా నేటి సమాజం వైఫల్యంగా చూడాల‌న్నాడు ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా. మద్యం, సిగరెట్లు బహిరంగంగా అమ్ముతున్న దేశంలో సానిటరీ ప్యాడ్లను మాత్రం దాచాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకు ఉందో చెప్పాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంద‌న్నాడు.
రాజ్యసభలో రాఘవ్ చద్దా రుతుక్రమ కళంకాన్ని విమర్శించారు. శానిటరీ ప్యాడ్లు, నీరు, గోప్యత లేక పోవడం వల్ల ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్లకపోతే, అది ఆమె వ్యక్తిగత సమస్య కాదద‌న్నారు. పూర్తిగా ఆయా ప్ర‌భుత్వాల వైఫ‌లంగా భావించాల్సి ఉంటుంద‌న్నాడు. పీరియడ్స్‌ను కళంకం చేయడంపై బలమైన వాదనలు వినిపించారు. 35 కోట్ల మంది మహిళలు , బాలికలు సిగ్గు లేకుండా ఋతు పరిశుభ్రత గురించి మాట్లాడ లేకపోతే దేశం తనను తాను నిజంగా ప్రగతిశీలమని చెప్పుకోలేమని అన్నారు. రుతు పరిశుభ్రత దాతృత్వం కాదు. ఇది ఒక ఉపకారం కాదు. ఇది ఒక ఉపాయం కాదు. ఇది ఆరోగ్యం, విద్య సమానత్వానికి సంబంధించిన విషయ‌మ‌ని పేర్కొన్నారు ఎంపీ. అన్నింటికంటే ముఖ్యంగా, ఇది గౌరవానికి సంబంధించిన‌ద‌ని స్ప‌ష్టం చేశాడు.
The post నెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలిపిఠాపురంకు మోడ‌ల్ స్టేష‌న్ హోదా క‌ల్పించాలి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలని కోరారు. ఈ మేర‌కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన

KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్

KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం బీఫాం అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్. ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్

రామాయ‌ణంపై కామెంట్స్ ప్ర‌కాశ్ రాజ్ పై కేసురామాయ‌ణంపై కామెంట్స్ ప్ర‌కాశ్ రాజ్ పై కేసు

హైద‌రాబాద్ : విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. త‌ను ప‌దే ప‌దే వ్య‌క్తం చేస్తున్న అభిప్రాయాలు, కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా ఆయ‌న ఓ స‌మావేశంలో రామాయ‌ణం గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై