hyderabadupdates.com Gallery ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను

ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను

ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను post thumbnail image

న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌మాన్ అవార్డుల ప్ర‌దానోత్సం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త జ‌ట్టు త‌ర‌పున హాజ‌ర‌య్యాడు సంజు శాంస‌న్. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే తో చిట్ చాట్ చేశాడు . అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కూల్ గా ఇచ్చాడు శాంస‌న్. ఈనెల 28 నుంచి ప్రారంభం అయ్యే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో ఈ ఏడాది త‌ను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పు నుంచి కాకుండా రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌నున్నాడు.
తన‌ను తాను మ‌రోసారి నిరూపించు కునేందుకు ఐపీఎల్ దోహ‌ద ప‌డుతుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పాడు సంజు శాంస‌న్. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేద‌న్నాడు. ఈసారి నా పాత్ర చాలా సులభంగా ఉండ బోతోంద‌ని తాను భావిస్తున్నాన‌ని చెప్పాడు సంజు శాంస‌న్. కేవలం మైదానంలోకి వెళ్లడం, బ్యాటింగ్ చేయడం, అంతటా పరుగెత్తడం, క్రికెట్ ఆటను ఆస్వాదించడం మాత్ర‌మే మిగిలి ఉంద‌న్నాడు.కాబట్టి ఈసారి అంతా చాలా సులభంగా ఉందన్నాడు. ప్రత్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా, నా బాధ్యతగా నేను చేయాల్సిన పనిని మాత్రమే చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు సంజు శాంస‌న్.
యువ ఆటగాడు ఆయుష్ మాత్రేతో మీరు ఎలాంటి సంభాషణలు జరుపుతారు? మరికొన్ని వారాల్లో మీరిద్దరూ కలిసి ఆడబోతున్నారు కదా? అన్న ప్ర‌శ్న‌కు కూల్ గా ఆన్స‌ర్ ఇచ్చాడు. ఈ రోజుల్లో, వారికి ఏం చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోందని చెప్పాడు.
The post ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్ర‌తి ఏటా ప్ర‌భ‌ల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వ‌హిస్తామ‌ని, ఈ మేర‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపార‌ని చెప్పారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ

పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏజ్ పెరిగినా ఇంకా డిమాండ్ ఉన్న న‌టుల‌లో మెగాస్టార్ చిరంజీవి కాగా మ‌రొక‌రు విక్ట‌రీ వెంక‌టేశ్. ఈ ఇద్ద‌రూ క‌లిసి తాజాగా న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు ప్రేక్ష‌కుల

Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టోMahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో

Mahagathbandhan: బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌ (Mahagathbandhan) మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్‌’ పేరుతో