hyderabadupdates.com Gallery ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’

ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’

ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ post thumbnail image

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు అన పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. వారి విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనిపేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరజీవి త్యాగ శిల్పం వద్ద మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు.
అమరావతి ప్రాంతంలోని శాఖమూరులో కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటుచేస్తోంది. 6 నెలల రికార్డు సమయంలోనే ప్రాజెక్ట్ మొదట దశ పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. జై వాసవీ మాత. ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం. అమరజీవి.. చిరంజీవి. మరణంలేని గొప్ప శక్తి. త్యాగానికి మానవ రూపం. ఆంధ్రప్రదేశ్ రూపంలో జీవించే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి రోజు 58 అడుగుల విగ్రహం రూపంలో మనకోసం మళ్లీ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. డూండి రాకేష్ నా దగ్గరకు వచ్చి ఏం పేరు పెట్టాలనే దానిపై సలహా అడిగారు. అప్పుడు నా మనసులో తోచింది ఒక్కటే ఆ విగ్రహం చూస్తే ఆయన త్యాగం గుర్తుకు రావాలి. అందుకే ‘స్టాచ్యూ ఆప్ శాక్రిఫైస్’ అని పెడదాం అని చెప్పాను. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.
The post ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహంCJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం

    కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని

CM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two yearsCM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two years

Chief Minister Revanth Reddy has instructed the officials to complete the construction of the new buildings of Osmania Hospital within two years. He held a review meeting at his residence on the progress of the construction work

Saudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందంSaudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

    సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ