hyderabadupdates.com movies పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల గ్యాప్ లో హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో పలకరించిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉగాది కానుకగా వచ్చే గురువారం ఈ సినిమా విడుదల కానుంది.

ఐతే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి అనుకున్నంత హైప్ కనిపించడం లేదు. తక్కువ గ్యాప్ లో పవన్ నుంచి మూడో సినిమా వస్తుండడం.. దర్శకుడు హరీష్ శంకర్ ఫాంలో లేకపోవడం.. ప్రోమోలు అంత గొప్పగా లేకపోవడం.. ఇలా సినిమాపై అంతగా అంచనాలు ఏర్పడకపోవడానికి కొన్ని కారణాలు. దీంతో పాటుగా రిలీజ్ అవుతున్న దురంధర్-2 చిత్రానికి తెలుగులో కూడా మంచి హైపే ఉంది. ఒక డబ్బింగ్ సినిమా నుంచి పవన్ మూవీకి ముప్పు ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ పరిస్థితి చూస్తే అదే జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పవన్ చివరి సినిమా ఓజీ మంచి ఫలితాన్నే అందుకున్నప్పటికీ ‘ఉస్తాద్’కు అనుకున్నంత హైప్ లేకపోవడం గురించి కొందరు వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. కానీ పవన్ సినిమాకు రిలీజ్ కు కొన్ని రోజుల ముందు వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. విడుదలప్పుడు అంతా మారిపోతుంది.

మేకింగ్ టైంలో ఫాన్స్ కూడా లైట్ అనుకున్న కాటమరాయుడు చిత్రానికి సైతం మంచి ఓపెనింగ్స్ రావడం.. రిలీజ్ రోజు ప్యాక్డ్ హౌస్ లతో షోలు నడవడం గుర్తుండే ఉంటుంది. విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొన్న హరిహర వీరమల్లుకు సైతం ఇదే జరిగింది. కాబట్టి ఉస్తాద్ విషయంలో భయపడాల్సిన పనిలేదు.

తమ ఆకాంక్షలకు తగ్గట్లు సినిమాలు చెయ్యడని, తన పొటెన్షియాలిటీని సరిగా వాడుకోడని పవన్ ను ఓవైపు విమర్శిస్తూనే ఆయన సినిమా రిలీజ్ అయినపుడు డ్యూటీ ఎక్కేయడం, థియేటర్లను నింపేయడం అభిమానులకు అలవాటే. ఉస్తాద్ విషయంలోనూ అదే జరుగుతుందనడంలో సందేహం లేదు. కావాల్సిందల్లా సినిమాకు పాజిటివ్ టాక్ మాత్రమే. అది వస్తే మిగతాది తర్వాత ఫాన్స్ చూసుకుంటారు.

Related Post

4 Telugu Films to Watch on OTT This Week: Rashmika Mandanna’s The Girlfriend to The Great Pre-Wedding Show4 Telugu Films to Watch on OTT This Week: Rashmika Mandanna’s The Girlfriend to The Great Pre-Wedding Show

Cast: Thiruveer, Teena Sravya, Rohan Roy, Narendra Ravi, Yamini Nageswar, Prabhavathi, Madhavi Director: Rahul Srinivas Lukalapu Genre: Slice-of-life Comedy Drama Runtime: 1 hour and 56 minutes Streaming Date: December 5,