hyderabadupdates.com movies చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్. ఇండియాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా రావాల్సి ఉందని, అందుకే దాన్ని ఇప్పటిదాకా రివీల్ చేయలేదని అంటున్నారు. DCP ఫైల్ తో పాటు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు పంపాల్సిన కంటెంట్ ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు ఉదయం లోగా చేరుకునేలా నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారట.

ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. మార్చి 19 విడుదల తేదీకి కట్టుబడటంతో పాటు ముందు రోజే ప్రీమియర్లు వేయాలన్న నిర్ణయం తీసుకోవడం వల్ల దర్శకుడు ఆదిత్య ధార్ టీమ్ మీద ఒత్తిడి పెరిగిపోయింది. కలర్ గ్రేడింగ్, రీ రికార్డింగ్ కొంత ఆలస్యం కావడం వల్ల అనుకున్న టైంకి ఫస్ట్ కాపీ సిద్ధం చేయలేకపోయారు. విదేశాలతో పోల్చుకుంటే మన సెన్సార్ నిబంధనలు కఠినం కాబట్టి వాటన్నిటిని ఫాలో అవుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.

ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకు దురంధర్ ది రివెంజ్ ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాయంత్రం అయిదు గంటలకు ఒకేసారి షోలు ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే డబ్బింగ్ వెర్షన్లకు ఎలాంటి సమస్య రాకూడదని బయ్యర్లు కోరుకుంటున్నారు. కేవలం ప్రీమియర్ల నుంచే నలభై కోట్లకు పైగా రాబట్టేసిన దురంధర్ 2 మొదటి రోజు ఈజీగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేస్తుందని ట్రేడ్ ముందస్తుగా అంచనా వేస్తోంది.

ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో ప్రతి చోటా హైప్ రావడం ఈ మధ్యకాలంలో దురంధర్ రివెంజ్ కే చూస్తున్నాం. గతంలో పఠాన్, జవాన్ లాంటివి మంచి ట్రెండ్స్ చూపించినప్పటికీ మరీ దురంధర్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జిల్లా కేంద్రాలు, పట్టణాలు సైతం ఫుల్ అయినవి లేవు. ఒకవేళ రేపు రాత్రికి కనక పాజిటివ్ టాక్ వస్తే కనీసం వారం రోజులు టికెట్లు దొరకనంత ఊచకోత ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. జియో స్టూడియోస్ అయితే అంత నమ్మకంగా ఉంది.

Related Post

న్యూ ఏజ్ దర్శకులకు ప్రభాస్ ఛాన్స్న్యూ ఏజ్ దర్శకులకు ప్రభాస్ ఛాన్స్

అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ జీవితాలకు దగ్గరగా కథలు రాసుకునేవాళ్లను ఈ బ్యాచ్ లోకి చేర్చవచ్చు. ముఖ్యంగా మలయాళంలో వీళ్ళు కొన్నిసార్లు చేస్తున్న వండర్లు బాక్సాఫీస్

జూబ్లీహిల్స్ ‘కుక్కర్’ లో ఓట్లు ఉడుకుతాయా?జూబ్లీహిల్స్ ‘కుక్కర్’ లో ఓట్లు ఉడుకుతాయా?

అగ్గిపుల్ల..సబ్బు బిళ్ల..కుక్క పిల్ల..కాదేదీ కవితకనర్హం అన్నారు మహా కవి శ్రీ శ్రీ…అయితే, మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు, బ్యాగులు…ఇలా కావేవీ ఓటర్లకు పంచేందుకు అనర్హం అంటున్నారు రాజకీయ నాయకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లును ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరికి