hyderabadupdates.com movies దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు టైంకు పడతాయానే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించి కంటెంట్ డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ఆ షోలు లేటయ్యేలా ఉన్నాయి. హిందీ మాత్రం చెప్పిన సమయానికి ఎలాంటి జాప్యం లేకుండా స్టార్ట్ అవుతుందని టాక్.

కేవలం వంద రోజుల గ్యాప్ లో ఒక బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ రావడం, దాని మీద ఇన్నేసి అంచనాలు నెలకొనడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మొదటి భాగానికి పార్ట్ 2 మధ్య గ్యాప్ ఉన్న సినిమాలు బోలెడున్నాయి. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన మనీ నుంచి మొదలుపెట్టి నిన్నటి పుష్ప దాకా అందరూ ఫాలో అయ్యింది ఇదే.

కానీ జియో స్టూడియోస్ దీన్ని బ్రేక్ చేసింది. దురంధర్ డిసెంబర్ లో వస్తే మార్చి లో దురంధర్ 2 దిగుతోంది. అది కూడా మాటలకందని హైప్ తో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషన్ సృష్టించేంతగా. 3 గంటల 50 నిమిషాల నిడివిని జనాలు ఏ మాత్రం లెక్క చేయడం లేదంటే ఏ స్థాయిలో దర్శకుడు ఆదిత్య ధార్ మీద నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టే ట్రైలర్ కంటెంట్ బజ్ ని అమాంతం పెంచేసింది.

రాత్రి తొమ్మిది నుంచి సోషల్ మీడియాలో అసలు రచ్చ మొదలవుతుంది. దురంధర్ రివెంజ్ ఫీడ్ బ్యాక్ లు, రివ్యూలు, వీడియో క్లిప్పులు, పబ్లిక్ రియాక్షన్లు, హౌస్ ఫుల్ వీడియోలు ఒకటా రెండా ఓ రేంజ్ హడావిడి ఉంటుంది. పాజిటివ్ టాక్ వచ్చిందా ఆకాశమే హద్దుగా వసూళ్లు చెలరేగిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షోలు రేపు ఉదయం మనుంచి ప్రారంభం కావడం దురంధర్ ది రివెంజ్ కు ప్లస్ అయ్యేలా ఉంది. లెట్ వెయిట్ ఫర్ ది గేమ్.

Related Post

Rishab Shetty’s Kantara Chapter 1 enters Rs 100 Cr club in Hindi
Rishab Shetty’s Kantara Chapter 1 enters Rs 100 Cr club in Hindi

Sandalwood actor-director Rishab Shetty’s Kantara Chapter 1, the prequel to the blockbuster fantasy drama Kantara, has surpassed a special milestone today. The film’s Hindi version has royally entered the Rs