hyderabadupdates.com movies లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియా స‌హా.. అధికారుల‌కు కూడా చెప్ప‌కుండానే ఎలాంటి కాన్వాయ్ కూడా రాకుండానే.. కేవ‌లం రెండు కార్ల‌తో స‌ద‌రు పాఠ‌శాల‌ను విజిట్ చేశారు. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని స్వ‌యంగా రుచి చూశారు. కొన్నాళ్ల కింద‌ట ఇదే పాఠ‌శాల‌లో విద్యార్థులు మ‌ధ్యాహ్న భోజ‌నం బాగోలేద‌ని.. ఆరోపిస్తూ.. డ‌స్ట్‌బిన్‌ల‌లో వాటిని వేసేశారు.

ఈ దృశ్యాల‌ను స్వ‌యంగా ప్ర‌ధానోపాధ్యాయుడు జానీ వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెట్టారు. దీంతో వివాదం పెరిగి.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలో మంత్రి లోకేష్ ఆక‌స్మిక తనిఖీ చేసి.. మ‌ధ్యాహ్న భోజ‌నం రుచి చూశారు. విద్యార్థుల‌తోనూ ముచ్చ‌టించి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. అయితే.. ఇది ఆ పాఠ‌శాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌కు సెగ పెంచేసింది. త‌ర‌చుగా మంత్రి లోకేష్‌.. మీమీ నియోజ‌క‌ర్గాల్లో ప‌ర్య‌టించి.. పాఠ‌శాల‌ల ప‌నితీరును ప‌రిశీలించాల‌ని చెబుతున్నారు.

కానీ, కొంద‌రు మాత్ర‌మే ప‌ర్య‌టిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎప్పుడూ ఉండేదే క‌దా! అని లైట్ తీసుకుంటున్నారు. ఇదొక్క‌టే కాదు.. ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హించాలని చెబుతున్నా.. అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు అనేక నియోజ‌క‌వ‌ర్గాలు ఆల‌వాలంగా మారాయి. వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు లోకేష్ ఖండిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు లైట్ తీసుకుంటు న్నారు. తాజాగా ఎవ‌రికీ చెప్ప‌కుండానే.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పాఠ‌శాల‌కు లోకేష్ రావ‌డంతో నాయ‌కులు ఉలిక్కిప‌డ్డారు.

త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇలాంటి ఆక‌స్మిక త‌నిఖీలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన నాయ‌కులు బుధ‌వారం తెల‌తెల‌వారుతూనే.. పాఠ‌శాలల బాట ప‌ట్టారు. ప్రార్థ‌నా గీతం నుంచి వారు పాఠ‌వాల‌ను ప‌ర్య‌వేక్షించారు. విద్యార్థుల హాజ‌రును తెలుసుకున్నారు. వంట‌కు వినియోగించే ప‌దార్థాల‌ను ప‌రిశీలిం చారు. అయితే.. ఇది కూడా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాదు. కొన్నింటికే ప‌రిమితం అయ్యారు. మొత్తంగా నారా లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీలు పార్టీలో క‌ల‌వరం రేపాయి. ప్ర‌స్తుతానికి లోకేష్ ఎవ‌రిపైనా సీరియ‌స్ కాక‌పోయినా.. ముంద‌స్తుగా నాయ‌కులు అలెర్టు కావ‌డం గ‌మ‌నార్హం.

Related Post

పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !

గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు ముఖ్యమైన విషయాల్లో ఆయన ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ప్రధానంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే

దేవి కోసమే తమన్‌‌ రాలేదటదేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందిస్తే.. తమన్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. ఐతే మొన్నటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ