hyderabadupdates.com Gallery సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు

సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు

సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు post thumbnail image

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్న దృష్ట్యా రామ‌కృష్ణ‌రావు ప‌ద‌వీ కాలం పూర్త‌యినా మ‌రికొంత కాలం పాటు పొడిగించాల‌ని కోరుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుమ‌ల రేవంత్ రెడ్డి కేంద్ర స‌ర్కార్ కు విన్న‌వించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మూడు నెల‌ల పాటు పొడిగిస్తూ ఓకే చెప్పింది.
ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది 2025 ఏప్రిల్ 30న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాద్య‌త‌లు స్వీక‌రించారు. వాస్తవానికి తన ప్రస్తుత పదవీ కాలాన్ని ఆగస్టు 31న పూర్తి చేయాల్సి ఉంది. గ‌తంలో రాష్ట్ంలో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి ఆధ్వ‌ర్యంలో ప‌దేళ్ల పాటు పాల‌న కొన‌సాగింది. ఆ త‌ర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఇదే క్ర‌మంలో రామ‌కృష్ణారావు కంటే ముందు శాంతి కుమారి సీఎస్ గా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం నూత‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి ప‌ద‌వి రేసులో సీనియ‌ర్ ఐఏఎ్ లు ఉన్నారు. వీరిలో ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న జ‌యేష్ రంజ‌న్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది.
The post సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాంతిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాం

వ‌రంగ‌ల్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప – లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు.

అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమూల్ బ్రాండ్ తరహాలోనే డ్వాక్రా ఉత్పత్తుల కోసం రూపొందించిన స్వయం బ్రాండ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్ర‌సంగించారు. వివిధ అంశాల్లో

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లుధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై కూట‌మి స‌ర్కార్ ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శ‌నివారం శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యేలు అడిగిన ప‌లు ప్ర‌శ్నల‌కు స‌మాధానం ఇచ్చారు.