hyderabadupdates.com Gallery చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్ కీప‌ర్ గా శాంస‌న్

చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్ కీప‌ర్ గా శాంస‌న్

చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్ కీప‌ర్ గా శాంస‌న్ post thumbnail image

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డ‌మే కాకుండా కేవ‌లం 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడిన కేర‌ళ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఏకంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 321 ర‌న్స్ చేశాడు. టోర్న‌మెంట్ లో త‌న‌కు అరుదైన అవార్డు ల‌భించింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ గా ఎంపిక‌య్యాడు. ఇదే స‌మ‌యంలో త‌ను ఐపీఎల్ లో టాప్ స్కోర‌ర్ జాబితాలో కూడా చోటు సంపాదించాడు. ఇదిలా ఉండ‌గా ఈనెల 28వ తేదీ నుంచి అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) టోర్న‌మెంట్ ప్రారంభం కానుంది.
అయితే ఈసారి సంజు శాంస‌న్ కొన్నేళ్ల పాటు ప్రాతినిధ్యం వ‌హించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌డం లేదు. త‌నను ఏరికోరి తీసుకుంది చెన్నై సూప‌ర్ కింగ్స్. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యం వ‌హిస్తుండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌త్తా చాటిన మ‌రో క్రికెట‌ర్ శివ‌మ్ దూబే కూడా సీఎస్కేలో జాయిన్ అవుతున్నాడు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు కుంబ్లే. రాబోయే రోజుల్లో త‌దుప‌రి సీఎస్కే వికెట్ కీప‌ర్ గా శాంస‌న్ ఆడ‌నున్నాడ‌ని, ఇప్ప‌టికే గ్ల‌వ్స్ ఇచ్చే ప‌నిలో ధోనీ ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. అంతే కాకుండా త‌ను నాయకత్వ బృందంలో భాగంగా ఉంటాడని పేర్కొన్నాడు. రుతురాజ్ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్ట వ‌చ్చ‌ని కూడా తెలిపాడు కుంబ్లే.
The post చెన్నై సూప‌ర్ కింగ్స్ వికెట్ కీప‌ర్ గా శాంస‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరిNara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

    ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు

ఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలిఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలి

గుంటూరు జిల్లా : ఎన్నారైలు స‌మాజ అభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాల‌ని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో

టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలుటిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

తిరుపతి : టిటిడి అనుబంధ ఆలయాల్లో శ్రీ ప‌రాభ‌వ నామ‌ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకోదండ రామాలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి, నాగలాపురం శ్రీ