hyderabadupdates.com Gallery రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు

రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు

రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న తండ్రి, తెలంగాణ‌కు తొలి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక నీకు లేద‌న్నారు. నీలాగా చిల్లరగా చిలకొట్టుడు కొట్టి బ్లాక్ మెయిల్ చేసిన నాయకుడు త‌ను కాద‌న్నారు. ఉద్యమాల ఉగ్గుపాలతో ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఆయన కాలి గోటికి కూడా నువ్వు స‌రిపోవంటూ మండిప‌డ్డారు. కాలం మనది కానప్పుడు తీన్ ఫుట్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా మాట్లాడుతాడంటూ ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నాడు మైక్ కట్ కాబట్టి ఏదైనా వాగుతాడని అన్నారు.
ఇది బడ్జెట్ సెషన్ కాదు.. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ సెషన్ అంటూ సీరియ‌స్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి వచ్చుడు వచ్చుడే మోతీలాల్, గోతీలాల్ నెహ్రూని , సోనియా గాంధీని బలిదేవత అని కామెంట్స్ చేసిన విష‌యం మ‌రిచి పోయార‌ని అనుకుంటే పొర‌పాటు పడిన‌ట్లేన‌ని అన్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో ప్రతిపక్షం ఆరు గ్యారంటీల గురించి, పేదల ఇండ్లను విధ్వంసం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాల గురించి నిలదీస్తున్నదని చెప్పారు. రెండు రోజులుగా హస్తినలో అధిష్టానం ముందు అపాయింట్మెంట్ గురించి పడిగాపులు పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి సమాధానం ఇవ్వాల్సింది ఉంద‌న్నారు.
అధికారం కోసం ఇచ్చిన హామీల గురించి, ప్రతిపక్షాలు శాసనసభలో నిలదీసిన ప్రశ్నల గురించి కానీ ప్ర‌స్తావించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రెండేళ్లలో ఈ సర్కారు దోపిడీ ఎంత అన్నది ప్రతిపక్షం ప్ర‌శ్నిస్తోంద‌న్నారు. ఈ సర్కారు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు, రైతుల పంటలు ఎందుకు కొనడం లేదని ప్ర‌శ్నించారు.
The post రేవంత్ రెడ్డీ కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోవు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్షMinister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

    మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు

రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీరెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ

న్యూఢిల్లీ : దేశ‌మంత‌టా నిత్యం వినియోగించే గ్యాస్ కు సంబంధించి ఆందోళ‌న‌లు నెల‌కొన్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి గుడ్ న్యూస్ చెప్పింది మోదీ స‌ర్కార్. వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని పేర్కొంది. గ్యాస్

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్

ఆఫ్గ‌నిస్తాన్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. త‌న సార‌థ్యంలో నిర్వ‌హిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలంలో త‌మ దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొన బోరంటూ ప్ర‌క‌టించింది ఆఫ్గ‌నిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని