hyderabadupdates.com Gallery ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్ post thumbnail image

హైద‌రాబాద్ : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఇందులో ముఖ్య పాత్ర పోషించారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో అందాల భామ‌లు శ్రీ‌లీల‌, రాశీ ఖ‌న్నా న‌టించారు. ఈ సినిమాకు ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు సంగీతం అందించారు. మిశ్ర‌మ స్పంద‌న‌ల మ‌ధ్య ఉస్తాద్ భ‌గత్ సింగ్ ఏకంగా రూ. 30 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు సినీ ప‌రిశ్ర‌మ టాక్. ఇదిలా ఉండ‌గా బలమైన ప్రమోషన్లు వసూళ్లను పెంచడంలో సహాయ పడతాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. మ‌రో వైపు ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌ణ్ బీర్ క‌పూర్ , సారా అర్జున్ క‌లిసి న‌టించిన సీక్వెల్ మూవీ దురంధ‌ర్ -2 ప్రేఓకుల ముందుకు వ‌చ్చింది.
దీంతో ఆ సినిమా నుంచి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గ‌ట్టి పోటీని ఎదుర్కొంది. ఆశించిన మేర కంటే ఎక్కువ‌గానే ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. పెద్ద ఎత్తున వ‌సూళ్లు చేస్తోంది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. భారీ నికర వసూళ్లను నమోదు చేసిందని ఒక డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ పోలీస్ డ్రామా నేప‌థ్యంతో సినిమాను తెర‌కెక్కించాడు. అయితే ఈ మూవీ వారాంతంలో మరింత వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, కొన్ని కేంద్రాలలో ఈ చిత్రం ప్రారంభ వసూళ్లు ఓజీ కంటే తక్కువగా ఉన్నాయని స‌మాచారం. పవన్ కళ్యాణ్ ఒక మూస కథాంశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోలేదు అని ఓ పంపిణీదారుడు పేర్కొన్నారు.
The post ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఆకాష్‌, భైర‌వి అర్ద్యా క‌లిసి న‌టించిన చిత్రం కొత్త మ‌లుపు. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ లో బుధ‌వారం మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తుండ‌డం

తిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవంతిరుమ‌ల‌లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గం.ల నుండి అర్థరాత్రి 12

సినీ దిగ్గ‌జాలకు అవార్డులు ఇవ్వ‌డం భేష్సినీ దిగ్గ‌జాలకు అవార్డులు ఇవ్వ‌డం భేష్

హైద‌రాబాద్ : తెలుగు సినిమాలు పరిమాణానికి, ఆత్మకు మధ్య సమతుల్యతను పాటిస్తాయని అన్నారు ప్ర‌ముఖ న‌టి మాధురీ దీక్షిత్.ఈ గౌరవానికి గాను ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా దిగ్గజాలు, ఐకాన్‌ల మధ్య ఇక్కడ ఉండటం