hyderabadupdates.com movies 10 మంది మంత్రులకు శ్రీముఖమా?

10 మంది మంత్రులకు శ్రీముఖమా?

సీఎం చంద్రబాబు మంత్రి విస్తరణపై తరచుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్న ప్రతిసారీ ఈ అంశంపై చర్చ నడుస్తోంది. మంత్రి వర్గ ప్రక్షాళనలో వీరిని ఇంటికి పంపిస్తారు, వారిని పంపిస్తారు అంటూ ప్రధాన మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో ఆసక్తికర ప్రచారం కూడా వినిపిస్తోంది. ఏకంగా 10 మంది మంత్రులకు చంద్రబాబు శ్రీముఖం ఇవ్వనున్నారు, వారిని తప్పిస్తారని అంటున్నారు.

అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం ఆసక్తిగా మారింది. పార్టీ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి. మంత్రి వర్గంలో మార్పులు ఉండొచ్చని కానీ ఒకేసారి 10 మందిని మార్చే ఆలోచన లేదని చెబుతున్నాయి. ఎక్కువలో ఎక్కువ నలుగురు నుంచి ఐదుగురు వరకు మార్పులు ఉండొచ్చని సమాచారం. అంతకుమించి మార్పులు చేస్తే అది సరైన సంకేతాలు ఇవ్వదని కూడా అంటున్నారు. ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నారని ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.

ఇక మహిళా మంత్రుల్లో ఇద్దరిని మార్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బయటకు ఫైర్ బ్రాండ్‌గా కనిపిస్తున్నా పనితీరు విషయంలో వెనుకబడ్డ మరో నేతకు కూడా ఛాన్స్ తగ్గే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈసారి మంత్రి వర్గ విస్తరణలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువ నాయకుడికి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేత మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు.

ఎంత మంది అనుకూల నాయకులు ఉన్నా నలుగురికి మించి అవకాశాలు ఉండవని అంటున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుందని కొందరు చెబుతున్నా, మరికొందరు మాత్రం ఆ అవకాశాలను ఖండిస్తున్నారు.

మహిళా నేతల్లో సీమ ప్రాంతం నుంచి ఒకరికి ప్రాధాన్యం ఉండొచ్చని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సవిత ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆమె స్థానంలో మార్పు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తానికి ఒకేసారి 10 మంది మంత్రులను మార్చే పరిస్థితి లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Related Post

Lokesh Kanagaraj Reveals Why He Opted Out of Rajinikanth–Kamal Haasan FilmLokesh Kanagaraj Reveals Why He Opted Out of Rajinikanth–Kamal Haasan Film

Talented Tamil director Lokesh Kanagaraj recently announced a big project with Tollywood star Allu Arjun. Tentatively titled AA23, the film is expected to go on floors from June 2026. Before