hyderabadupdates.com Gallery త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు

త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు

త్వ‌రలో మాజీ సీఎం  కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు post thumbnail image

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, సంతోష్ రావుల అరెస్ట్ త‌ప్ప‌ద‌ని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ద‌ర్యాప్తు సంస్థ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌న్నారు. ఈరోజు అసెంబ్లీ అనంతరం మీడియా చిట్ చాట్ లో కీలకమైన కామెంట్స్ చేశారు సీఎం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇప్ప‌టికే విచార‌ణకు సంబంధించి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కీల‌క‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు సీఎం. కేవలం పంజాగుట్ట పీఎస్ లో నమోదైన ప్రైవేట్ కేసులో మాత్రమే క్లీన్ చిట్ వచ్చిందని అన్నారు. దీనికే మిడిసిప‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ ఏటీఎం లాగా వాడుకుంద‌ని ఆరోపించారు. లెక్క‌కు మించిన ఆస్తులు ఎలా వ‌చ్చాయో, ఏం ప‌ని చేస్తే వ‌చ్చిందో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం.
ఇదే ఫోన్ ట్యాప్ కు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం మొత్తం కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిప‌డ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగింద‌ని, దానిపై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. బీ ఆర్ ఎస్ హయంలో ఆరువేల ఫోన్లు ట్యాప్ చేశారనీ…చేసిన తప్పుకు శిక్ష తప్పదని సీఎం అన్నారు.
The post త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఎవ‌రైనా స‌రే చైనాకు చెందిన మాంజాల‌ను వాడితే, లేదా ఉప‌యోగించినా కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. #SayNoToChineseManja

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్

DGP Shivadhar Reddy : నిజామాబాద్‌ లో కానిస్టేబుల్‌ను హతమార్చిన (Conistable Death) వాహనాల దొంగ రియాజ్‌ (24) పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌… కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం

స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సీక్వెల్ చిత్రం బోర్డ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది భారీ అంచ‌నాల మ‌ధ్య‌. ఎవ‌రూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్