hyderabadupdates.com Gallery సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం

సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం

సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం post thumbnail image

తిరుపతి : తిరుపతిలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కోదండ రామస్వామి ఆల‌యం. ప్ర‌తి ఏటా బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతుండ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ ఏడాది కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నాలుగో రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై శ్రీ కోదండ రామ‌స్వామి వారు భక్తులకు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
సర్వ భూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింప జేసే వారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవోనాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సురేష్, హరికృష్ణ, ఆర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఘ‌నంగా చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం.
మ‌రో వైపు మార్చి 28 నుంచి ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యం బ్ర‌హ్మోత్స‌వాల‌కు సిద్ద‌మైంది. తాజాగా భ‌క్తుల ఆక‌లిని తీర్చేందుకు నిత్య అన్న‌దానం ప్రారంభించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు.
The post సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టంరామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం

హైద‌రాబాద్ : బిగ్ బాస్ స్టార్ శ్రీ స‌త్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ హీరో రామ్ పోతినేని గురించి తాజాగా స్పందించింది. త‌నంటే చాలా ఇష్ట‌మ‌ని, త‌ను లేకుండా నేను ఉండ‌లేనంటూ పేర్కొంది శ్రీ స‌త్య‌. అంతే కాదు త‌న‌కున్న

75 దేశాల పౌరుల‌కు వీసా సేవ‌లు నిలిపివేత‌75 దేశాల పౌరుల‌కు వీసా సేవ‌లు నిలిపివేత‌

అమెరికా : యావ‌త్ ప్ర‌పంచానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి. ఇప్ప‌టికే వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్న ట్రంప్ ఉన్న‌ట్టుండి మ‌రో బాంబు పేల్చారు. గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

జ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానంజ‌నాభా భారం కాదు అభివృద్దికి సోపానం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి జ‌నాభా గురించి ప్ర‌స్తావించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని స్ప‌ష్టం చేశారు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్లానింగ్‌కి